Home » BCCI
భారత్, ఇంగ్లండ్ మధ్య (India vs England) 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన ధర్మశాల టెస్టుకు (Dharmasala Test) 15 మందితో కూడిన జట్టుని బీసీసీఐ (BCCI) ప్రకటించింది. రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్.
యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లకు బీసీసీఐ షాకిచ్చింది. రంజీలు ఆడమని ఎంత చెప్పినా వినకుండా నిర్లక్ష్యంతో వ్యవహరించినందుకు వీరిద్దరికీ తనదైన శైలిలో గుణపాఠం చెప్పింది.
మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2024ను దృష్టిలో పెట్టుకుని పలువురు ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు ముఖ్యంగా రంజీ ట్రోఫికి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులువేస్తోంది.
తల్లి అనారోగ్యం కారణంగా రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఎమర్జెన్సీగా ఇంటికి వెళ్లిన దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. మూడో టెస్టు నాలుగవ రోజున అశ్విన్ తిరిగి జట్టుతో కలవనున్నాడని క్లారిటీ ఇచ్చింది. అంటే నేడు (ఆదివారం) జట్టుతో కలవనున్నాడు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా బీసీసీఐ వెల్లడించింది.
టీమిండియా యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ వైఖరిపై బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సూచనలను ఇషాన్ కిషన్ లెక్క చేయలేదు. ఆ వెంటనే బీసీసీఐ సెక్రటరీ జై షా రంగంలోకి దిగారు. ఇషాన్ కిషన్ పేరు ప్రస్తావించకుండా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ గత నెల రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. దక్షిణాఫ్రికా టూర్లో విరామం కోరిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌కు బీసీసీఐ కూడా మద్ధతిచ్చింది. అయితే భారత్ తిరిగొచ్చిన ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో ఆడకపోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు విరాట్ దూరమయ్యాడు.
New Sponcers: టీమిండియాకు కొత్త స్పాన్సర్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు భారత క్రికెట్ జట్టు అధికారిక భాగస్వాములుగా కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ వ్యవహరించనున్నాయి. 2024 నుంచి 2026 వరకు ఆయా సంస్థలు స్పాన్సర్లుగా ఉంటాయని బీసీసీఐ తెలిపింది.
Viral Video: కేప్ టౌన్ టెస్టులో టీమిండియా గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూంలో ఉత్కంఠగా మ్యాచ్ వీక్షిస్తున్న కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను విరాట్ కోహ్లీ కౌగిలించుకోవడం కెమెరాలకు చిక్కింది. అటు గిల్, జైశ్వాల్ కూడా విన్నింగ్ షాట్ కోసం ఎదురుచూస్తున్న హావభావాలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది
దక్షిణాఫ్రికా నుంచి అకస్మాత్తుగా భారత్ వచ్చిన టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టుతో కలిశాడు. డిసెంబర్ 26 నుంచి మొదలుకానున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడనున్నాడు. సెలవు తీసుకున్న మూడు రోజులు కోహ్లీ లండన్‌లో ఉన్నాడని, ఈ మేరకు తన ప్రణాళికలను ముందుగానే టీమ్ మేనేజ్మెంట్కు తెలియజేశాడని బీసీసీబీ వర్గాలు వెల్లడించాయి.