New Sponcers: టీమిండియాకు కొత్త స్పాన్సర్లు.. బీసీసీఐ ప్రకటన
ABN , Publish Date - Jan 09 , 2024 | 05:03 PM
New Sponcers: టీమిండియాకు కొత్త స్పాన్సర్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు భారత క్రికెట్ జట్టు అధికారిక భాగస్వాములుగా కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ వ్యవహరించనున్నాయి. 2024 నుంచి 2026 వరకు ఆయా సంస్థలు స్పాన్సర్లుగా ఉంటాయని బీసీసీఐ తెలిపింది.
టీమిండియాకు కొత్త స్పాన్సర్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు భారత క్రికెట్ జట్టు అధికారిక భాగస్వాములుగా కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ వ్యవహరించనున్నాయి. 2024 నుంచి 2026 వరకు ఆయా సంస్థలు స్పాన్సర్లుగా ఉంటాయని బీసీసీఐ తెలిపింది. ఇప్పటివరకు టీమిండియా స్పాన్సర్‌గా డ్రీమ్ ఎలెవన్ ఉంది. ఇప్పుడు కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ రావడంతో టీమిండియా ఆటగాళ్ల జెర్సీలు మారనున్నాయి. ఆప్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో మన ఆటగాళ్లు కొత్త జెర్సీలతో బరిలోకి దిగనున్నారు.
కాగా కాంపా అనేది రిలయన్స్ ఆధ్వర్యంలోని కన్స్యూమర్ ప్రొడక్ట్. ఇది అనేక వేరియంట్లలో లభించే కూల్‌డ్రింక్. ఇటీవల కాలంలో ప్రజాదరణ పొందుతున్న బ్రాండ్ కావడంతో ఇప్పుడు ఏకంగా క్రికెట్ జట్టుకు స్పాన్సర్‌గా ఎంపికైంది. మరోవైపు ఆటంబర్గ్ టెక్నాలజీస్ సంస్థ పలు గృహోపకరణాలను అందిస్తోంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ఉపకరణాల బ్రాండ్‌లలో ఈ సంస్థ ఒకటి. ఫ్యాన్లు, మిక్సీలు వంటి ఉత్పత్తులను ఈ సంస్థ వినియోగదారులకు అందిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.