Home » Bhagwant Mann
భగవంత్ మాన్ 'లెప్టోస్పిరోసిస్'తో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో తేలిందని మొహలిలోని ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. అయితే ప్రధాన అవయవాలు నిలకబడగా పనిచేస్తు్న్నట్టు చెప్పారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పారిస్ పర్యటనకు బ్రేక్ పడింది. ఆయన పారిస్ వెళ్లేందుకు రాజకీయ అనుమతిని కేంద్ర విదేశాంగ శాఖ నిరాకరించింది. భద్రతా కారణాల రీత్యా ఆయనకు అనుమతి నిరాకరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎంఈఏ సమాచారం పంపింది.
పంజాబ్‌లోని లుధియానాలో శివసేన లీడర్ సందీప్ థాపర్‌పై జరిగిన కత్తి దాడి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఖలిస్తాన్ వ్యతిరేకి అయిన ఆయనపై నిహాంగ్ సిక్కులు...
ఢిల్లీ మద్యం పాలసీకేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలుకు పంపినా అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని చెబుతూ వస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆ దిశగా పావులు కదుపుతోంది. జైలులో సీఎం కార్యాలయం ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ కోర్టుకు వెళ్తామని ఆ పార్టీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ శనివారంనాడు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ నుంచి తాము ఒంటిరిగానే పోటీ చేస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారంనాడు ప్రకటించిన కొద్ది సేపటికే పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వంతపాడింది. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో 'ఆప్' ఒంటిరిగానే పోటీ చేస్తుందని ప్రకటించింది.
తనని చంపేస్తానంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఇచ్చిన బెదిరింపులపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ బుధవారం స్పందించారు. తాను రాష్ట్ర శాంతి, శ్రేయస్సు సంరక్షకుడని.. అాంటి బెదిరింపులు వ్యూహాలకు తాను ఏమాత్రం భయపడబోనని అన్నారు.
'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ''కాంగ్రెస్ ఒకప్పుడు ఉండేది'' అంటూ తల్లులు తమ పిల్లలకు చెప్పుకుంటారంటూ పంజాబ్ ముఖ్యమంత్రి భగ్‌వంత్ మాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. ఆప్‌ను విశ్వసించలేమని, ఆ పార్టీ సుప్రీం అరవింద్ కేజ్రీవాల్‌కు కూటమి రాజకీయాలపై అవగాహనం లేదని మండిపడింది.