Share News

Lok Sabha elections: ఇండియా కూటమికి దెబ్బమీద దెబ్బ... మమత బాటలోనే పంజాబ్ 'ఆప్'

ABN , Publish Date - Jan 24 , 2024 | 03:53 PM

లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ నుంచి తాము ఒంటిరిగానే పోటీ చేస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారంనాడు ప్రకటించిన కొద్ది సేపటికే పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వంతపాడింది. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో 'ఆప్' ఒంటిరిగానే పోటీ చేస్తుందని ప్రకటించింది.

Lok Sabha elections: ఇండియా కూటమికి దెబ్బమీద దెబ్బ... మమత బాటలోనే పంజాబ్ 'ఆప్'

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా బీజేపీపై పోటీ చేయాలనుకున్న 'ఇండియా' (I.N.D.I.A.)కూటమికి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ నుంచి తాము ఒంటిరిగానే పోటీ చేస్తామని టీఎంసీ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) బుధవారంనాడు ప్రకటించిన కొద్ది సేపటికే పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కూడా వంతపాడింది. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో 'ఆప్' ఒంటిరిగానే పోటీ చేస్తుందని ప్రకటించింది.


పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై ఆప్ నిర్ణయాన్ని ప్రకటించారు. ''పంజాబ్‌లో మేము ఒంటిరిగానే పోటీ చేస్తాం. కాంగ్రెస్‌తో పొత్తులాంటివేవీ ఉండవు'' అని అన్నారు. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలనే పార్టీ పంజాబ్ విభాగం ప్రతిపాదనను ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గతవారం కూడా పంజాబ్‌లోని మొత్తం 13 సీట్లలో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని తెలిపారు.

Updated Date - Jan 24 , 2024 | 03:53 PM