Home » Bhimavaram
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో దారుణం చోటు చేసుకుంది. దొంగ నోట్ల వ్యవహారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రధాని నిందితుడిని విడిపించి.. తీసుకు వెళ్లేందుకు ముఠా స్కెచ్ వేసింది.
గత ఐదేళ్లలో ఆక్వా రంగం కుదేలు అయిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం ఈ రంగంపై సరైన దృష్టి పెట్టలేదు. దీంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు.. తమ సమస్యలు ఎవరి దృష్టికి తీసుకు వెళ్లాలో కూడా వారికి తెలియ లేదు.
కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తండ్రి సూర్యనారాయణరాజు (91) అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదారాబాద్లోని పైవ్రేటు ఆసుపత్రిలో గురువారం సాయంత్రం మృతి చెందారు.
వైసీపీ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వ్యాపారాలపై ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) అధికారుల దాడులు మూడో రోజు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. రూ. కోట్ల వ్యాపారాలకు సంబంధించి పన్నులు ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసం సహా గ్రంధి వ్యాపార భాగస్వాముల ఇళ్లు, వ్యాపార సంస్థలలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.
వైసీపీ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వ్యాపారాలపై ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) అధికారుల దాడులు గురువారం కూడా కొనసాగనున్నాయి. రూ. కోట్ల వ్యాపారాలకు సంబంధించి పన్నులు ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసం సహా గ్రంధి వ్యాపార భాగస్వాముల ఇళ్లు, వ్యాపార సంస్థలలోనూ బుధవారం సోదాలు నిర్వహించారు.
బీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంతోపాటు ఆయన కార్యాలయంపై ఐటీ శాఖ అదికారులు బుధవారం దాడులు చేశారు. అయితే ఆ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్పై గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
భీమవరానికి చేపలు, రొయ్యల పరిశ్రమ కారణంగా దేశంలో గుర్తింపు వచ్చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. చేపల చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు వాడటం వల్ల క్వాలిటీ దెబ్బతినే పరిస్థితి ఉందని అన్నారు. శనివారం నాడు మంత్రి భూపతిరాజు భీమవరంలో పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు దృష్టి సారించారు. అందులోభాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మంగళవారం భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పర్యవేక్షించారు. ఆ క్రమంలో ఎయిర్పోర్ట్ టెర్మినల్, రన్ వే తదితర నిర్మాణాలను ఆయన పరిశీలించారు.
రాజకీయాలు కొత్త ఏం కాదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ (Bhupathiraju Srinivasa Varma) అన్నారు. కష్టపడ్డ సామాన్య కార్యకర్తకు బీజేపీ గుర్తింపు ఇస్తుంది అనేదానికి తాను ఉదాహరణ అని చెప్పారు. పొత్తుల చర్చల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తకు ఇచ్చే భరోసా ఏంటి అని ప్రశ్నించామని అన్నారు.
పవన్ కల్యాణ్ భీమవరం సభలో చాకు కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు చాకుతో సభకు హాజరయ్యారు. సదరు వ్యక్తుల కదలికలను అనుమానించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని వెదకగా జేబులో చాకులు లభ్యమయ్యాయి. భీమవరం బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు. టూ టౌన్ పోలీసులు అదుపులో ఇద్దరు యువకులు ఉన్నారు.