Police Complaint Against Duvvada: వరుస ఫిర్యాదులు.. నెక్ట్స్ దువ్వాడేనా
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:56 AM
Police Complaint Against Duvvada: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన నేతలు సీరియస్‌గా ఉన్నారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్లలో జనసైనికులు ఫిర్యాదులు చేస్తున్నారు.

పశ్చిమగోదావరి, మార్చి 11: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై (MLC Duvvada Srinivas) జనసేన నాయకులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల అసెంబ్లీ సమావేశం ప్రారంభ సమయంలో దువ్వాడ.. డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా పవన్ కుటుంబానికి సంబంధించి కామెంట్స్ చేశారు. పవన్‌పై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దువ్వాడ శ్రీనివాస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
దువ్వాడ వ్యాఖ్యలపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం రూరల్ పోలీస్‌స్టేసన్‌లో దువ్వాడపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీలను పోలీసులకు స్వీకరించారు. అయితే పోలీసులు ఇంకా కేసు నమోదు చేయనట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు కాపీ పంపించిన అనంతరం వారు సూచనల మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. పవన్‌పై దువ్వాడ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Special Needs Schools: ఏపీలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు
అయితే వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదు అవుతున్నప్పటికీ ఆ పార్టీ నేతల తీరు మాత్రం మారడం లేదు. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళిపై కేసులు నమోదు అవడమే కాకుండా వారిని అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీలుగా ఉంచారు. ఇంత జరుగుతున్నప్పటికీ ఆ పార్టీ నేతల మాటల ప్రవాహం ఏ మాత్రం తగ్గడం లేదు. డిప్యూటీ సీఎం పవన్‌పై దువ్వాడ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అసెంబ్లీకి వచ్చే ముందు పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ. చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ నెలకు రూ.50 కోట్లు తీసుకుంటున్నారని, అందుకే ఆయన శాసనసభలో కనిపించడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా దువ్వాడపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదు అయ్యాయి. పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముందుగా గుంటూరులోని పాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. అలాగే విజయనగరంలో కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే అవనిగడ్డ, మచిలీపట్నం పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. కోనసీమ జిల్లాలో జనసేన మహిళా కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఏ క్షమణమైన దువ్వాడ అరెస్ట్ తప్పదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి...
PM Modi: మారిషస్ చేరుకున్న ప్రధాని మోదీ.. రెండు రోజులు కూడా..
IT Raids: దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై రెండో రోజు ఐటి సోదాలు
Read Latest AP News And Telugu News