Home » BJP
ఫడ్నవిస్‌ను సీఎంగా నిర్ణయించే విషయంలో షిండేకు ఎలాంటి కోపం లేదని కూడా సుధీర్ ముంగటివార్ అన్నారు. ఒక శాఖకు సంబంధించి సొంత డిమాండ్లు ఉంటే దాని అర్ధం కోపంగా ఉన్నట్టు కాదని, షిండేకు తగిన గౌరవం ఉంటుందని చెప్పారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని, దీనిపై వస్తున్న వదంతులన్నీ నిరాధారమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తనయుడు శ్రీధర్ షిండే సోమవారంనాడు వివరణ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత ఎంపికపై కేంద్ర పరిశీలను పార్టీ అధిష్ఠానం నియమించింది.
ఏడాది పాలనలో ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా.. రూ.కోట్లు వెచ్చించి ఎందుకీ విజయోత్సవాలు..? అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు. ‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి..’ అని ప్రజలతో ఓట్లు వేయించుకున్న కాంగ్రె్‌సతో, ఏ మార్పూ సాధ్యం కాదని ఏడాదిలోనే తేలిపోయిందని అన్నారు.
అదానీని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తుంటే రేవంత్ రెడ్డి రూ.100 కోట్ల చెక్కు ఎందుకు తీసుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. అదానీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు.
రసూలాబాద్ ఘాట్‌కు చారిత్రక ప్రాధాన్యత ఉంది. మరణించిన వ్యక్తుల అంత్యక్రియులు ఇక్కడ నిర్వహిస్తుంటారు. స్వాతంత్ర్య సమరయోధుడు చంద్ర శేఖర్ ఆజాద్ అంత్యక్రియలు ఇక్కడే జరిగాయి.
కాంగ్రెస్ పాలనపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విజయోత్సవాల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. హామీలు నెరవేర్చకుండా సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ నెల 6న సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రుణమాఫీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. దొరల గడీలను కూల్చారని చెప్పారు. పాలమూరులో కృష్ణమ్మ పారుతున్నా ప్రజల కష్టాలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్, ఏంఐఏం పార్టీలు కలిసి బల్దియాను లూటీ చేస్తున్నారంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. స్టాండింగ్ కమిటీ మీటింగ్‌కు వచ్చిన మేయర్‌ను బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కార్పొరేటర్లు యత్నించారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల గారడీ అంటూ బీజేపీ చార్జిషీటు విడుదల చేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన 6 అబద్ధాలు.. 66 మోసాలు అని పేర్కొంటూ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని బీజేపీ నిర్ణయించింది.