Home » Britain
జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ సతీ సమేతంగా ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయంలో పూజలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తాను గర్వించే హిందువునని చెప్పారు.
జీ20 సమావేశాల్లో అన్ని పక్షాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న సమావేశాల్లో సానుకూల ఫలితాలు రావడం కోసం అందరితో పాటు పని చేస్తామని తెలిపింది.
ప్రపంచంలో అత్యంత సంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశాల్లో బ్రిటన్ ఒకటి. అలాంటి దేశం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా బ్రిటన్‌లో రెండో అతిపెద్ద నగరమైన బర్మింగ్‌హాట్ సిటీ కౌన్సిల్ దివాలా...
పశ్చిమ కరేబియన్ సముద్రంలో ట్యాక్స్ ఫ్రీ దేశంగా కేమ్యాన్ ఐలాండ్స్ ఉన్నాయి. ఈ ఐల్యాండ్‌లో నగదు నిల్వ చేయాలంటే ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. దీంతో వ్యక్తిగతంగా ఎంత డబ్బు అయినా ఈ బ్యాంక్‌లో దాచుకునే సౌకర్యం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ యూకే పర్యటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
బ్రిటన్ ప్రధానిగా ఎంపికైన కొత్తలో రిషి సునాక్‌కి అనుకూల వాతావరణం ఉండేది. కానీ.. క్రమంగా ప్రతికూల గాలులు వీస్తూ వస్తున్నాయి. రిషి ప్రభుత్వంపై చాలామంది అసంతృప్తితో...
భారత దేశం క్రమంగా ఎదుగుతున్న తీరును విదేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. కోవిడ్-19కు టీకాను సొంతంగా అభివృద్ధి చేసి, 130 కోట్ల మంది భారతీయులకు టీకాకరణ చేయడంలో విజయవంతమవడం దగ్గర నుంచి చంద్రయాన్-3 చంద్రునిపై అడుగు పెట్టడం వరకు అన్నిటినీ పరిశీలిస్తున్నాయి.
‘నేను రాక్షసి’ని అనుకుంటూ బ్రిటన్‌లో ఓ నర్స్ ఏడుగురు పసికందులను చంపేసింది. మరో ఆరుగురు నవజాత శిశువుల హత్యకు విఫలయత్నం చేసింది. ఆమె నేరాన్ని రుజువు చేయడంలో భారతీయ మూలాలుగల ఓ వైద్యుడు న్యాయస్థానానికి సహకరించారు.
బ్రిటిష్ ప్రధాన మంత్రి రుషి సునాక్ మరోసారి తన హిందుత్వాన్ని చాటుకున్నారు. గతంలో సతీ సమేతంగా గోవును పూజించి అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన రామ కథ ప్రవచనానికి హాజరయ్యారు.
బ్రిటన్ అంటే, చట్టం నుంచి తప్పించుకుని, దాక్కోవడానికి అనువైనచోటు కాదని ఆ దేశ భద్రతా శాఖ మంత్రి టామ్ టుగెంధట్ చెప్పారు. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని తమ దేశం నుంచి పంపించడానికి న్యాయపరమైన ప్రక్రియలను తప్పనిసరిగా పాటించాలన్నారు. భారత్, బ్రిటన్ దేశాలకు నిర్దిష్ట న్యాయ ప్రక్రియలు ఉన్నాయని చెప్పారు.
కింగ్డమ్కు వచ్చే బ్రిటన్, ఐర్లాండ్ పౌరులకు సౌదీ అరేబియా శుభవార్త అందించింది. ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Foreign Affairs) ఈ రెండు దేశాల జాతీయులకు రాజ్యంలోకి ప్రవేశించడానికి ఎలక్ట్రానిక్ వీసా మినహాయింపు (Electronic Visa Waiver) ని ప్రారంభించింది.