Saudi Arabia: సౌదీ వెళ్లే ఆ రెండు దేశాల పౌరులకు సూపర్ ఛాన్స్.. ఇకపై..

ABN , First Publish Date - 2023-08-04T07:49:53+05:30 IST

కింగ్‌డమ్‌కు వచ్చే బ్రిటన్, ఐర్లాండ్ పౌరులకు సౌదీ అరేబియా శుభవార్త అందించింది. ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Foreign Affairs) ఈ రెండు దేశాల జాతీయులకు రాజ్యంలోకి ప్రవేశించడానికి ఎలక్ట్రానిక్ వీసా మినహాయింపు (Electronic Visa Waiver) ని ప్రారంభించింది.

Saudi Arabia: సౌదీ వెళ్లే ఆ రెండు దేశాల పౌరులకు సూపర్ ఛాన్స్.. ఇకపై..

రియాద్: కింగ్‌డమ్‌కు వచ్చే బ్రిటన్, ఐర్లాండ్ పౌరులకు సౌదీ అరేబియా శుభవార్త అందించింది. ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Foreign Affairs) ఈ రెండు దేశాల జాతీయులకు రాజ్యంలోకి ప్రవేశించడానికి ఎలక్ట్రానిక్ వీసా మినహాయింపు (Electronic Visa Waiver) ని ప్రారంభించింది. సౌదీ తీసుకున్న నిర్ణయం కారణంగా బ్రిటీష్ జాతీయులందరూ ఇకపై ప్రయాణానికి ముందు ప్రత్యేకంగా విజిట్ వీసా పొందాల్సి అవసరం లేదు. అలాగే సింగ్ ఎంట్రీ ద్వారా ఇరు దేశాల పౌరులు సౌదీలో 6 నెలల వరకు బస చేసేందుకు వీలు కల్పించింది. బిజినెస్, పర్యాటకం, రిసెర్చ్, వైద్య ప్రయోజనాల కోసం కింగ్‌డమ్‌ను సందర్శించే రెండు దేశాలవారికి ఈ మినహాయింపు వర్తిస్తుందని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

దీనికోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలోని యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫారమ్ (Unified National Visa Platform) ద్వారా దరఖాస్తు చేస్తే సరిపోతుందని సంబంధిత అధికారులు తెలిపారు. సౌదీ (Saudi) కి వచ్చే తేదీకి మూడు నెలల ముందు నుంచి రెండు రోజుల మధ్య వరకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును సైతం కల్పించింది. ఇక దరఖాస్తు సమర్పించిన 24 గంటల్లోగా లబ్ధిదారునికి ఈ-మెయిల్ ద్వారా వీసా ఆమోదం పంపించడం జరుగుతుంది.

Mahzooz draw: లక్ అంటే నీదే భయ్యా.. రూ.5.61లక్షలు ఖర్చు చేస్తే.. రూ.45కోట్ల జాక్‌పాట్!

ఇదిలాఉంటే.. అటు బ్రిటన్ కూడా సౌదీ పౌరుల కోసం ఈ విధమైన ఈవీడబ్ల్యూ (EVW) సదుపాయాన్ని గతేడాది జూన్ 1వ తారీఖు నుంచే ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం యునైటెడ్ కింగ్‌డమ్‌ (United Kingdom) ను సందర్శించాలనుకునే సౌదీలు ఎవరైనా సరే జర్నీకి ముందుగా విజిట్ వీసా పొందాల్సిన అవసరం లేదు. అలాగే దరఖాస్తుదారులు బయోమెట్రిక్‌లను అందించడం, వీసా దరఖాస్తు కేంద్రానికి హాజరు కావడం లేదా ఈవీడబ్ల్యూ కోసం ప్రయాణానికి ముందుగా పాస్‌పోర్ట్‌లను అందజేయాల్సిన అవసరం లేదు. అయితే, యూకే (UK) లో ఉద్యోగం, అధ్యయనం, సెటిల్‌మెంట్ కోసం వీసా అవసరాలు యథాతథంగా ఉంటాయి.

Indian Woman: సింగపూర్ క్రూయిజ్ నుండి దూకి 64 ఏళ్ల భారతీయ మహిళ మృతి..!


Updated Date - 2023-08-04T07:49:53+05:30 IST