Home » Chennai News
కోయంబత్తూరులో ఇటీవల జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో జీఎస్టీ లోపాలను ఎత్తిచూపిన హోటల్ యజమాని పట్ల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల వైఖరి గర్హనీయమని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీఎస్టీని సరళతరం చేయాలని కోరిన అన్నపూర్ణ గ్రూప్ హోటల్స్ యజమాని శ్రీనివాసన్‌తో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల క్షమాపణలు చెప్పించుకొన్నారంటూ వైరల్ అయిన వీడియో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
పెళ్ళిపేరుతో సుమారు యాభైమందిని మోసగించిన కేసులో అరెస్టయిన ఈరోడ్ జిల్లాకు చెందిన యువతి సంధ్యకు మద్రాసు హైకోర్టు(Madras High Court) బెయిలు మంజూరు చేసింది. తిరుప్పూరు జిల్లా తారాపురానికి చెందిన మహేష్ అరవింద్(Mahesh Aravind) అనే యువకుడు ఆన్లైన్లో వధువు కోసం అన్వేషిస్తుండగా సంధ్యతో పరిచయం ఏర్పడింది.
రాష్ట్రంలో ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా డీఎంకే శ్రేణులు భయపడాల్సిన అవసరమే లేదని, నటుడు విజయ్(Actor Vijay) నాయకత్వంలోని తమిళగ వెట్రికళగం పార్టీ మనుగడ ఆరు మాసాలేనని మంత్రి దామో అన్బరసన్(Minister Damo Anbarasan) ఎద్దేవా చేశారు.
రామనాథపురం(Ramanathapuram) జిల్లా పాంబన్ వద్ద రూ.535 కోట్లతో నిర్మించిన రైల్వే వంతెన పనులు ఈ నెలాఖరులో పూర్తికానున్నాయి. దీంతో అక్టోబరు 2న ప్రధాని నరేంద్రమోదీ ఈ వంతెనను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో పాక్ జలసంధి ప్రాంతంలో పాంబన్ రైల్వే వంతెన(Pamban Railway Bridge) ఉంది.
నీలగిరి జిల్లా కున్నూరు వెలింగ్టన్ కంటోన్మెంట్ మైదానం(Cantonment Ground)లో జాతీయ కర్రసాము పాఠశాలల సమాఖ్య, వజ్రం క్రీడాభివృద్ధి సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో కర్రసామును ప్రోత్సహించే విధంగా ప్రపంచ రికార్డు కోసం నిర్విరామ కర్రసాము ప్రదర్శన జరిగింది.
మక్కల్‌నీది మయ్యం నాయకుడు కమల్‌హాసన్(Kamal Haasan) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథోపరిజ్ఞానం) కోర్సు చేయడానికి ఈ నెలాఖరున అమెరికా వెళ్తున్నారు. రెండు నెలలపాటు ఆయన ఆ కోర్సు అధ్యయనం చేయనున్నారు. అదే సమయంలో అమెరికా నుంచే ఆయన పార్టీ వ్యవహారాలు నడపాలని కూడా నిర్ణయించారు.
పాలన చేతగాకే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పార్టీని నడపలేక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైకిల్ తొక్కుతున్నారని తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్(Dr. Tamilisai Soundararajan) వ్యంగ్యాస్త్రం సంధించారు.
నీలగిరి జిల్లా ఊటీ(Ooty)లో రెండో సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెల 7, 8, 14, 15వ తేదీల్లో ప్రత్యేక కొండ రైలు(Hill train) సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన ఊటీలోని ఆహ్లాదరకమైన వాతావారణాన్ని ఆస్వాదించేందుకు సీజన్ రోజుల్లో వివిధ ప్రాంతాకు చెందిన పర్యాటకులు వెళ్తుంటారు.
కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలోనే డీఎంకే కొనసాగాలన్నదే తమ అభిమతమని రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి కేఎన్ నెహ్రూ(Minister KN Nehru) మరోమారు స్పష్టం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు వీవో చిదంబరం పిళ్ళై జయంతిని పురస్కరించుకుని, తిరుచ్చి న్యాయస్థానం సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి కేఎన్ నెహ్రూ గురువారం ఉదయం నివాళులర్పించారు.