Home » CM Jagan
Andhrapradesh: అమరావతిపై సీఎం జగన్ రెడ్డికి సీతకన్ను అని కూటమి నేతలు మండిపడ్డారు. గురువారం కూటమి నేతలు వర్లరామయ్య, మాల్యాద్రి, లంకా దినకర్, యామిని శర్మ, శివశంకర్, అజయ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ... మూడు ముక్కలాటతో అమరావతిని జగన్ రెడ్డి విధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతే రాజధాని అని కేంద్రం స్పష్టం చేసిందన్నారు.
కేశినేని చిన్ని (శివనాథ్ ) ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు క్యూలు కడుతున్నారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ , కార్యవర్గంతో సహా ఐదు వందల మంది నేడు టీడీపీలో చేరారు. వారికి కేశినేని చిన్ని పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
Andhrapradesh: ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మళ్ళీ జగన్ లాంటి ముఖ్యమంత్రి రావొద్దని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజలు గొడ్డలి తీసుకోవాల్సిన అవసరం లేదని.. ఓటుతో జగన్‌కు సమాధానం చెప్పాలన్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై సీబీఐ షాక్ ఇచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నెల17 నుంచి జూన్ 1 వరకూ యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు. కుటుంబంతో జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందన్నారు. లండన్‌లో కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళుతున్నారని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు.
Andhrapradesh: కూటమి తనకు అభ్యర్థులే ముఖ్యమని.. వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలతో తనకు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ వచ్చాక రాష్ట్ర అభివృద్ధి కుంటు పడిందని విమర్శించారు. రాష్ట్రం బాగుండాలి అంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు రావాల్సిందే అని చెప్పుకొచ్చారు. దేశంలో ఉన్న సర్వేలు అన్నీ కూటమి గెలుపు ఖాయం అని చెబుతున్నాయన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని సీపీఎం రాఘవులు ఫైర్ అయ్యారు. నేడు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారకుడు జగనే.. ఆయన సహకారంతోనే ప్రైవేటీకరణ ప్రారంభమైందన్నారు. స్టీల్ ప్లాంట్‌ను రక్షిస్తానంటూ జగన్ వ్యాఖ్యలు కార్మికులను, ప్రజల్ని ఎగతాళి చేయడమేనన్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. పార్టీలన్నీ ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నాయి. అధికారం కోల్పోకూకడదని వైసీపీ.. అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్డీఏ కూటమి పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నాయి. నేడు కర్నూలు నగరానికి సీఎం జగన్ రానున్నారు. ఎస్బీఐ సర్కిల్ వైఎస్సార్ విగ్రహం వద్ద జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
కరువు నేలకు సాగునీరు జీవం పోస్తుంది. వ్యవసాయమే జీవనాధారమైనచోట రైతులు మొదట ఆశించేది నీటినే. కాలువ నీటితో పొలాలను పచ్చగా మార్చేందుకు చెమటోడుస్తారు. నీరే లేకుంటే కుదేలైపోతారు. ఎప్పుడు కురుస్తుందో తెలియని వానకోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసి.. అలసిపోవడం ఇక్కడి ప్రజలకు అలవాటైంది. ‘మా బతుకులు ఇంతేనా..?’ అని ఆవేదన పడే సమయంలో.. ‘మారుస్తాం.. నీరిస్తాం..’ అని ఎవరు చెప్పినా విశ్వసిస్తారు. ఆశపడి.. ఆదరిస్తారు. వైసీపీ అధినేత వైఎస్ జగన ఇలాంటి హామీనే ...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu)ని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. చంద్రబాబును రాజమండ్రి జైలులో కొన్ని రోజుల పాటు ఉంచి పలు ఇబ్బందులకు గురి చేసింది.
సీఎం జగన్ ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని స్పష్టం చేశారు.