Share News

AP Elections: తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేదు.. ఏపీకి ఇంకేం చేస్తావ్ జగన్?

ABN , Publish Date - May 09 , 2024 | 12:12 PM

Andhrapradesh: కూటమి తనకు అభ్యర్థులే ముఖ్యమని.. వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలతో తనకు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ వచ్చాక రాష్ట్ర అభివృద్ధి కుంటు పడిందని విమర్శించారు. రాష్ట్రం బాగుండాలి అంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు రావాల్సిందే అని చెప్పుకొచ్చారు. దేశంలో ఉన్న సర్వేలు అన్నీ కూటమి గెలుపు ఖాయం అని చెబుతున్నాయన్నారు.

AP Elections: తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేదు.. ఏపీకి ఇంకేం చేస్తావ్ జగన్?
Former MLA Gone Prakash Rao

విజయవాడ, మే 9: కూటమి తనకు అభ్యర్థులే ముఖ్యమని.. వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలతో తనకు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు (Former MLA Gone Prakash Rao) స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ (CM Jagan) వచ్చాక రాష్ట్ర అభివృద్ధి కుంటు పడిందని విమర్శించారు. రాష్ట్రం బాగుండాలి అంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) రావాల్సిందే అని చెప్పుకొచ్చారు. దేశంలో ఉన్న సర్వేలు అన్నీ కూటమి గెలుపు ఖాయం అని చెబుతున్నాయన్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ , స్టేట్ ఇంటిలిజెన్స్‌తో పాటు జగన్ సర్వేలు కూడా గెలవబోయేది కూటమే అని స్పష్టం చేశాయని తెలిపారు.

AP Elections: ఏపీ ఓటర్ల చూపు ఆ వైపేనా..


అదంతా మ్యాచ్ ఫిక్సింగే...

ఒక ఛానల్‌వతో జగన్ చేసిన ఇంటర్వ్యూ .. మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆరోపించారు. అడిగిన ప్రశ్నలు, చెప్పిన జవాబులు చూస్తేనే అందరకీ అర్ధం అవుతుందన్నారు. కూటమి 19 - 21 మధ్యలో పార్లమెంట్ స్థానాలు గెలవనుందని తెలిపారు. 120 -140 మధ్యలో అసెంబ్లీ స్థానాలను కూటమి సొంతం చేసుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూటమి ప్రభంజనం చూస్తారన్నారు. స్థానికులతో మాట్లాడుతుంటే కేశినేని శివనాథ్ చిన్నిపై ప్రజల్లో ఉన్న ఆదరణ అర్ధం అవుతుందన్నారు. 2 లక్షల మెజారిటీతో కేశినేని శివనాథ్ చిన్ని గెలవబోతున్నారన్నారు. అధికారం కోసం జగన్ అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ‘‘తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేదు.. రాష్ట్ర ప్రజలకు ఇంకేం చెప్తావ్..? వైఎస్ వివేకానంద రెడ్డిపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించారు. జగన్‌ను కాంగ్రెస్, సోనియా గాంధీ ఒప్పుకోలేదు. అందుకే జగన్ వివేకాను నాశనం చెయ్యాలని చూశారు’’ అని వ్యాఖ్యలు చేశారు.

AP Election 2024: జగన్ కుయుక్తులకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్


ఒక్క ఛాన్స్ ఇస్తే...

‘‘ఈరోజు జగన్‌కు భారతి స్ట్రోక్ తగలబోతోంది. పవర్ ప్రాజెక్ట్‌లో డబ్బులు సంపాందించకపోతే జగన్‌కు భారతి సిమెంట్, సాక్షి పేపర్, సాక్షి టీవీ ఎలా వచ్చాయి? ఒక్కఛాన్స్ అని ఇస్తే... ‌ఐదేళ్లల్లో అరాచక పాలన చూపించారు. రాష్ట్రాన్ని ఇరవై యేళ్లు వెనక్కి తీసుకెళ్లారు. ప్రజలు కూడా జగన్ డ్రామాలు తెలుసుకున్నారు.. బుద్ధి చెప్పడానికి సిద్ధం అంటున్నారు’’ అని గోనె ప్రకాశ్ రావు వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

Lok Sabha Polls: రిజర్వేషన్లపై రాద్దాంతం.. రాజ్యంగం ఏం చెబుతోంది..

Andhra Pradesh : అప్పుల కుప్ప

Read Latest AP News And Telugu News

Updated Date - May 09 , 2024 | 12:34 PM