Home » Coal India
బొగ్గు గనుల వేలం సింగరేణి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. వరుసగా తెలంగాణలోని బొగ్గు గనులను కేంద్రం వేలం వేస్తుండటంతో.. తవ్వేందుకు సింగరేణికి గనులు కరువయ్యే పరిస్థితి నెలకొంది.
సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
పదో విడత బొగ్గు గనుల వేలం ఈ నెల 21న హైదరాబాద్‌లో జరుగనుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 60 బొగ్గు బ్లాకులను వేలం వేయనున్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ వేలాన్ని ప్రారంభించనున్నారు.
దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచుతామని, ఖనిజాలను వెలికి తీసేందుకు కృషి చేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని శాస్ర్తి భవన్‌లో గురువారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
బొగ్గు గనిలో పని అంటే అంత ఆషామాషీ ఏమీ కాదు. ముఖ్యంగా ఎండాకాలంలో మరీ కష్టం. అసలే బొగ్గు గనిలో విపరీతమైన వేడి ఉంటుంది. దానికి తోడు మండే ఎండలు.. అంతటి శ్రమకోర్చి కుటుంబం గడవడం కోసం నానా తిప్పలు పడినా కూడా అప్పుడప్పుడు ప్రమాదాలు వెంటాడుతుంటాయి. తాజాగా గోదావరిఖని 11 ఇంక్లైయిన్ బొగ్గు గనిలో ప్రమాదం చోటు చేసుకుంది.
హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత భారీగా పడిపోయిన అదానీ షేర్లు అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల మద్దతుతో పుంజుకొని మునపటిస్థాయికి చేరిన తరుణంలో మళ్లీ ఆ సంస్థపై పాత అవినీతి ఆరోపణలు ముసురుకున్నాయి. సంఘటిత నేరాలు,