Share News

Kishan Reddy : 60 బొగ్గు బ్లాకుల వేలం రేపే

ABN , Publish Date - Jun 20 , 2024 | 04:44 AM

పదో విడత బొగ్గు గనుల వేలం ఈ నెల 21న హైదరాబాద్‌లో జరుగనుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 60 బొగ్గు బ్లాకులను వేలం వేయనున్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ వేలాన్ని ప్రారంభించనున్నారు.

Kishan Reddy : 60 బొగ్గు బ్లాకుల వేలం రేపే

  • జాబితాలో తెలంగాణలోని శ్రావణపల్లి కూడా..

  • హైదరాబాద్‌లో నిర్వహణ.. ప్రారంభించనున్న కిషన్‌రెడ్డి

  • 60 బొగ్గు బ్లాకుల వేలం 21న

  • హైదరాబాద్‌లో వేలం నిర్వహణ

  • ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

పదో విడత బొగ్గు గనుల వేలం ఈ నెల 21న హైదరాబాద్‌లో జరుగనుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 60 బొగ్గు బ్లాకులను వేలం వేయనున్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ వేలాన్ని ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి సతీష్‌ చంద్ర దూబే, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమృత్‌ లాల్‌ మీనా తదితరులు పాల్గొననున్నారు. మొత్తం 60 బొగ్గు బ్లాకుల్లో అత్యధికంగా ఒడిశాకు చెందిన 16 బ్లాకులు, ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన 15, జార్ఖండ్‌కు చెందిన 6, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌లకు చెందిన చెరో 3 బ్లాకులను వేలం వేయనుండగా... తెలంగాణలోని ఒక బ్లాకు (శ్రావణపల్లి) కూడా వేలం జాబితాలో ఉంది. ఈ బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గతంలో సింగరేణి నిర్వహించిన అన్వేషణలో తేలింది. అయితే, ఈ బ్లాకును దక్కించుకోవడానికి సింగరేణి కూడా తొలిసారి వేలంలో పాల్గొననుంది.

Updated Date - Jun 20 , 2024 | 04:44 AM