Home » Congress 6 Gurantees
దేశసంపదను అదానీ, అంబానీలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దోచిపెడుతున్నారని.. వారికి ఎందుకు ఓటు వేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రశ్నించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట, పందిళ్లలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ , కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు , ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
బడేభాయ్.. చోటే భాయ్ కలిసి మోటార్లకు మీటర్లు పెడతారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఆయన చేపట్టిన బస్సు యాత్ర 7వ రోజుకు చేరుకుంది. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేంద్రంలో మరోసారి బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. రిజర్వేషన్లు ముట్టుకుంటే బీజేపీ నేతలు మాడిమసై పోతారని వార్నింగ్ ఇచ్చారు.
అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ (Congress) గద్దెనెక్కిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. 10 ఏళ్లు కేంద్రంలో బీజేపీ ఉందని.. దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. పెట్రోల్ ధర, నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెంచిందని మండిపడ్డారు.
మాయమాటలు చెప్పటం తప్పా ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) దేశానికి ఏం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ప్రశ్నించారు. సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ (KCR) తనకు ఇచ్చిన వారసత్వం కరువని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సెటైర్లు గుప్పించారు. తాను అధిపత్యంపై యుద్ధం చేస్తున్నానని అన్నారు. శనివారం నాడు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీళ్లు, కరెంట్ ఎక్కువగా ఇస్తున్నామని చెప్పారు.
దేవుడు అయిన రాముడినీ సైతం బ్యాలెట్ బాక్స్‌లోకి తీసుకురావడం చాలా సిగ్గుచేటని.. ఆ దౌర్భాగ్య స్థితికి బీజేపీ (BJP) తెరలేపిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఆరోపించారు. ప్రధానమంత్రి స్థానంలో ఉండి నరేంద్రమోదీ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ (Congress) బ్రిటిష్ వారసత్వాన్ని ఇంకా కొనసాగిస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. బ్రిటిష్ ప్రతినిధిగా ఇటలీకి చెందిన సోనియాగాంధీని దేశంపై రుద్దే ప్రయత్నం చేశారని విరుచుకుపడ్డారు. ఆమె ప్రధాని కాకుండా బీజేపీ అడ్డుకుందని గుర్తుచేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తి వేస్తారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) ఆరోపించారు. నెహ్రు, అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొస్తే మోదీ తీసివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలుస్తామని మోదీ అంటున్నారని గెలిచి ఏం చేస్తారని ప్రశ్నించారు.
అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. మంగళవారం నాడు పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.