TG Elections: ఈ ఎన్నికల్లో మోదీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తాడు: జగ్గారెడ్డి
ABN , Publish Date - Apr 25 , 2024 | 08:46 PM
లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తి వేస్తారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) ఆరోపించారు. నెహ్రు, అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొస్తే మోదీ తీసివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలుస్తామని మోదీ అంటున్నారని గెలిచి ఏం చేస్తారని ప్రశ్నించారు.
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తి వేస్తారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) ఆరోపించారు. నెహ్రు, అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొస్తే మోదీ తీసివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలుస్తామని మోదీ అంటున్నారని గెలిచి ఏం చేస్తారని ప్రశ్నించారు. గురువారం నాడు గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్, బీజేపీలోని నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతామని తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని అన్నారు.
Lok Sabha Polls: తెలంగాణను ఢిల్లీ ఏటీఎంగా మార్చారు.. కాంగ్రెస్ నేతలపై షా ఫైర్!
పార్టీలో చేరుతామని ఏఐసీసీకి పలువురు నేతలు లేఖలు రాస్తున్నారని చెప్పుకొచ్చారు. 2 రోజుల్లో గాంధీ భవన్‌లో భారీగా చేరికలు ఉంటాయన్నారు. ఎవరు వచ్చి పార్టీలో చేరుతామన్న కండీషన్‌తో చేర్చుకుంటామని తెలిపారు. తెలంగాణలో త్వరలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సభలు ఉంటాయని స్పష్టం చేశారు. మే1వ తేదీ నుంచి తాను ప్రచారంలో పాల్గొంటానని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేస్తారని స్పష్టం చేశారు.
Minister Uttam: జస్టిస్ చంద్ర ఘోష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఉత్తమ్
మోదీ ఏడాదికి ఇస్తానని చెప్పిన 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మోదీ రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలు తీసుకురావడంతో లక్ష మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ 4వేల కిలో మీటర్లు భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర చేపట్టారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చేసిన నయవంచనను కాంగ్రెస్ ఛార్జ్‌షీట్ రూపంలో విడుదల చేసిందని జగ్గారెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి
CM Revanth: రిజర్వేషన్లు కావాలా?.. వద్దా? అనేదానికి ఈ ఎన్నికలే రెఫరెండం
Lok Sabha Elections 2024:నామినేషన్ వేసిన అనంతరం రఘురామిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News