Home » Corona Virus
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 412 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు భారత్‌లో 4170 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా కరోనా ( Corona ) మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
నిన్న మొన్నటిదాకా కేసులు పెద్దగా నమోదవ్వని తరుణంలో.. కరోనా వైరస్ నుంచి దాదాపు విముక్తి లభించిందని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే ఈ వైరస్ మరోసారి కోరలు చాచడం మొదలుపెట్టింది. గతకొన్ని రోజుల నుంచి మన భారతదేశంలో...
దేశాన్ని కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ దాడి చేస్తున్న మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రస్తుతం కరోనా ఉప వేరియంట్ JN.1 కారణంగా దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి.
అనేక దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక సూచన చేసింది. కరోనాపై తమ నిఘాను పటిష్టం చేయాలని ఆగ్నేసియా దేశాలను కోరింది. కోవిడ్ 19 కారణంగా శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
కరోనా మహమ్మారి (Corona) మరోసారి విజృంభిస్తోంది. గురువారం హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి ‘నీలోఫర్’లో 14 నెలల శిశు బాలుడికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. అయితే బాలుడి బాలుడి ఆరోగ్యం స్థిరంగానే ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషా రాణి వెల్లడించారు.
హైదరాబాద్: చిన్న పిల్లల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్‌తో పిల్లలను అప్రమత్తంగా ఉంచాలని కేంద్రప్రభుత్వం సూచించింది. హైదరాబాద్‌లో పిల్లల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.
వరంగల్: అంతం అయిపోయింది అనుకున్న కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. చాపకింద నీరులా రోజు రోజుకూ వ్యాప్తి చెందుతూ మరో సారి మానవాళిని భయపెడుతోంది.
కేరళ రాష్ట్రాన్ని కరోనా మళ్లీ వణికిస్తోంది. కొత్త వేరియంట్ ప్రభావంతో ఇటీవల మళ్లీ నమోదవుతున్న కరోనా కేసులు కేరళ వాసులను భయపెడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కేరళలో కొత్తగా 292 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో JN.1 వేరియంట్(Corona Varients) కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా 21 కరోనా కేసులు నమోదయ్యాయి. సదరు వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగి ఉందని డాక్టర్లు చెబుతున్నారు.