Home » CPI
Telangana: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రమాదవశాత్తు జారి పడటంతో గాయపడ్డారు. ఈనెల 16న కామారెడ్డిలో జరిగిన వివాహానికి హాజరైన సందర్భంగా వివాహ వేదిక ఎక్కుతూ సీపీఐ నేత జారి పడిపోయారు. అయితే దెబ్బ తగలలేదని భావించిన నారాయణ... ఈ ఘటన అనంతరం విశాఖపట్నం మరియు చెన్నైలో జరిగిన పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో నొప్పి ఎక్కువ కావడంతో డాక్టర్లను సంప్రదించగా.. రిబ్ ఎముక విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రధాని మోదీని, బీజేపీని వ్యతిరేకిస్తూ ఏర్పాటైన ఇండియా కూటమి(INDIA Bloc) విచ్ఛినమవుతోంది. ఆదివారం పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కూటమిని కాదని.. 42 లోక్ సభ స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు.
Telangana: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయటం సరైంది కాదని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వయనాడు లోక్సభ స్థానం సీపీఐది అని.. రాహుల్ గాంధీ మిత్రధర్మం పాటించాలని సూచించారు. పొత్తులో భాగంగా తెలంగాణలో సీపీఐకు ఒక లోక్సభ స్థానం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్రధర్మం పాటిస్తోందని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు మరో దొంగ నాటకానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తెరదీశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ(Ramakrishna) అన్నారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలు పూర్తయ్యాక విశాఖపట్నం నుంచి ప్రమాణస్వీకారం, పరిపాలన చేస్తానని జగన్ చెప్పటం నిరంకుశత్వానికి తార్కాణమని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమే తమ లక్ష్యంగా పని చేస్తామని మాస్ లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్(Pradeep Singh Tagore) అన్నారు. విప్లవ పార్టీలు ఐక్యం కావాలని, ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామని అన్నారు.
బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS) ఫాసిజం సిద్ధాంతాలను వ్యతిరేకించేందుకు ఐక్యతగా సీపీఐ(ఎంఎల్) పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు(Potu Ranga Rao) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఇండియా కూటమి పొత్తుధర్మం పాటించి, తమకు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) కోరారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీడీపీ-జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగగా.. ఈరోజు పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నేతలు చర్చించారు. ప్రజా పోరాటాలను కలిసి చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పొత్తులకు సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో శుక్రవారం నాడు సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత శ్రీనివాస రావు సమావేశమై చర్చిస్తారు. వైసీపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యుహం గురించి డిస్కష్ చేసే అవకాశం ఉంది. మేనిఫెస్టోలో ఏయే అంశాలు పొందుపరచాలి..? జనాలను ఎలా ఆకట్టుకోవాలనే అంశంపై వారి మధ్య చర్చ జరిగేందుకు ఆస్కారం ఉంది.
సీఎం జగన్ (CM Jagan) చాలా ధైర్యవంతుడని.. కానీ ఆ ధైర్యాన్ని చెడు పనులు చేయడంలో చూపుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) వ్యాఖ్యానించారు.