Home » CPI
బీఆర్ఎ్సతో పొత్తును ఆశించి భంగపడిన సీపీఐ.. ఇప్పుడిక పొత్తుల నిర్ణయాన్ని తమ కేంద్రనాయకత్వానికే వదిలివేయాలని నిర్ణయించింది.
సీఐఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైన్స్ పరంగా ఇస్రో శాస్త్రవేత్తలను అందరం అభినందించాలని వ్యాఖ్యానించిన ఆయన.. ఇస్రో ప్రయత్నాలకు మతం రంగు పులమాలని చూస్తున్నారని ప్రధాని మోదీపై మండిపడ్డారు. ఇస్రో ప్రయత్నాలను అవకాశంగా వాడుకోవాలని చూస్తున్నారని అన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (AP CM YS Jagan Mohan Reddy) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) విమర్శలు గుప్పించారు.
సీపీఐ బస్సుయాత్ర( CPI bus trip) నేడు కర్నూలుకు చేరుకున్నది. శుక్రవారం నాడు కర్నూలు జిల్లా(Kurnool District)లో పర్యటించారు.
దేశంలో దృష్టి మరల్చే రాజకీయాలు చేయడంలో మోడీ ఘనుడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలు చేశారు.
అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మార్పుతో తెలంగాణలో బీజేపీ పనైపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ - కమ్యూనిస్టులు కలిసి పోటీచేస్తే బీఅరెస్కు డిపాజిట్లు కూడా రావని దీమా వ్యక్తం చేశారు. ఆ దిశగా ప్రస్తుతం చర్చల దశలో ఉందని, కలిసి పోటీ చేసే పరిస్థితి వస్తే మాత్రం బీఅరెస్ ఓటమి తధ్యమని అన్నారు.
ఏపీలో జగన్మోహన్రెడ్డి(ap cm jagan) అరాచక పాలన చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(cpi Ramakrishna) అన్నారు.
హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల మధ్య స్నేహం చిగురిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ అదిష్టానం, ఇటు వామపక్షాల జాతీయ నాయకత్వాల చోరవతో ఎన్నికల పొత్తుకు సానుకూల వాతావరణం ఏర్పడినట్లు సమాచారం.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను (CM KCR) నమ్మిన పాపానికి వామపక్షాలను (Left Parties) నిలువునా ముంచేశారు.!. అదేదో సామెత ఉంది కదా.. ఏరు దాటాక.. అన్నట్లుగా మునుగోడు ఉప ఎన్నిక (Munugodu By Elections) సమయంలో స్నేహగీతం ఆలపించిన బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు (BRS, CPI, CPM) ఎంతో కాలం చెలిమిని కొనసాగించలేకపోయాయి...
ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు (Telangana Politics) వేగంగా మారుతున్నాయి. పొత్తు విషయంలో బీఆర్ఎస్ (BRS) దూరం పెట్టిన వామపక్షాలను కాంగ్రెస్ పార్టీ దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఉభయ కమ్యూనిస్టు నేతలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్ థాక్రే ఫోన్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్దామని కమ్యూనిస్టులను ఆయన కోరినట్టు తెలుస్తోంది.