TS Politics: ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని లెఫ్ట్ పార్టీల నిర్ణయం
ABN , First Publish Date - 2023-09-21T16:22:56+05:30 IST
కాంగ్రెస్.. కమ్యూనిస్టులకు సీట్లు ఇస్తుందని ఊహాజనితాలు ఎందుకు?, అక్టోబర్ 1న సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేసే స్థానాలను ప్రకటిస్తాం. అంగన్ వాడి కార్మికుల సమ్మె చేస్తే పోలీసులు కొట్టడాన్ని ఖండిస్తున్నాం. ఇప్పుడున్న
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీయాలని ఉభయ కమ్యూనిస్టులు నిర్ణయించాయి. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి సమావేశంలో కాంగ్రెస్‌తో (Congress) పొత్తుల అంశం చర్చకు రాలేదని కూనంనేని తెలిపారు. ‘‘కాంగ్రెస్.. కమ్యూనిస్టులకు సీట్లు ఇస్తుందని ఊహాజనితాలు ఎందుకు?, అక్టోబర్ 1న సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేసే స్థానాలను ప్రకటిస్తాం. అంగన్ వాడి కార్మికుల సమ్మె చేస్తే పోలీసులు కొట్టడాన్ని ఖండిస్తున్నాం. ఇప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం (Kcr Government) మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలవదు. ఉద్యమాలు ద్వారా ఏర్పడ్డ తెలంగాణలో ఉద్యమాలు చేస్తున్న వాళ్ళను అణచి వేయడం దారుణం. ఎంఐఎం, కేసీఆర్‌కు మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. సమైక్యత దినోత్సవం అంటే ఏమిటో ఎంఐఎం నేతలు, కేసీఆర్ చెప్పాలి. బీజేపీ అందరి మీద దాడులు చేస్తుంది.. కానీ ఎంఐఎం మీద ఒక్క కేసు పెట్టడం లేదు ఎందుకు?, జనాలను మభ్య పెట్టడానికే మహిళ బిల్లు తీసుకొస్తున్నారు. రాష్ట్రపతి విధవ మహిళ కావడంతోనే ఆమెతో పార్లమెంట్‌ను ప్రారంభించలేదు. సోషలిస్ట్, సెక్యులర్ పదాలను ఎలా తొలగిస్తారు. దేశానికి గుండె కాయ లాంటివి ఆ పదాలు.’’ అని తెలిపారు.