Home » Cricket
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ వచ్చేస్తోంది. ఐపీఎల్ సీజన్ కోసం క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ అంటేనే క్రేజ్. స్టేడియంలో ఆటగాళ్ల ఫోర్ల మోత, సిక్సులతో చెలరేగిపోతారు. వెంట వెంటనే వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టుపై బౌలర్లు ఒత్తిడి పెంచుతారు. చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగే మ్యాచ్ల కోసం క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
WPL 2024: స్మృతీ మందాన కెప్టెన్సీలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(Royal Challengers Bangalore) జట్టు వుమెన్ ప్రీమియర్ లీగ్(Women's Premier League) ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, 16 సీజన్ల ఒక్కసారిగా కూడా ఆర్సీబీ పురుషుల జట్టు ట్రోఫీని కొట్టలేదు. రెండవ సీజన్లోనే ఆర్సీబీ వుమెన్స్ టీమ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 16 ఏళ్ల కలను స్మృతి మందాన అండ్ టీమ్ సాధించడంతో ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
James Anderson: ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్(ames Anderson) క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. 700 టెస్టు వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్గా( నిలిచాడు. ధర్మశాలలో(Dharamsala) భారత్తో జరుగుతున్న 5వ టెస్టు 3వ రోజు సందర్భంగా కుల్దీప్ యాదవ్ను ఔట్ చేయడం ద్వారా 41 ఏళ్ల అండర్సన్ ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్గా చూసుకుంటే
భారతీయ జనతా పార్టీ నేత, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిసిషన్ తీసుకున్నారు. పార్టీ వ్యవహారాల నుంచి తనను తప్పించాలని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను గంభీర్ కోరారు.
రంజీ ట్రోఫీ 2024 సెమీ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి సెమీస్ మ్యాచ్లు ప్రారంభంకానున్నాయి. నాగ్పూర్ వేదికగా జరిగే తొలి సెమీస్ మ్యాచ్లో విదర్భ, మధ్యప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలో జరిగే రెండో సెమీస్ పోరులో ముంబై, తమిళనాడు జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి.
AP Politics: క్రికెటర్ ఆనంద్ విహారీ(Anand Vihari) వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్రంగా స్పందించారు. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా? అని ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు. అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ(YSRCP) వాళ్ళు.. ఇప్పుడు క్రీడలను కూడా వదలడం లేదని విమర్శించారు. వైసీపీ నేతల దౌర్భాగ్య రాజకీయాలకు క్రీడలకు బలి చేయడమేంటని నిలదీశారు.
Virat Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్లో(London) ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తన కూతురు వామికతో(Vamika) కలిసి లండన్లో వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ(Kohli) వ్యక్తిగత కారణాల వల్ల ఇండియా - ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగాడు.
రాంచీ టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులు చేసింది. జో రూట్ 122 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
ఐపీఎల్లో అడుగుపెట్టిన క్రికెటర్ల జీవితం దశ తిరుగుతుంది. క్రికెటర్ కెరియర్లోనే కాకుండా ఆర్థికంగానూ మరో స్థాయికి ఎదుగుతారు. కానీ ఈ ఏడాది ఐపీఎల్లో అరంగేట్రం చేస్తున్న ఓ ఆటగాడి తండ్రి మాత్రం ఇంకా సాదాసీదాగా ఓ ఎయిర్పోర్ట్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొడుకు ఉన్నతస్థాయికి ఎదిగినా ఇంకా కష్టపడుతున్న ఆయన ఎవరంటే.. ఐపీఎల్ వేలంపాటలో గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ.3.60 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన క్రికెట్ యువకెరటం రాబిన్స్ తండ్రి ఫ్రాన్సిస్ జేవియర్ మింజ్. కొడుకు రాత్రికి రాత్రే కోటీశ్వరుడైనా ఆయన మాత్రం ఇంకా సెక్యూరిటీగానే ఉద్యోగాన్ని చేస్తున్నారు.
తెలంగాణ, హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులకు శుభవార్త వచ్చింది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైంది. ఐపీఎల్ మొదటి దశ షెడ్యూల్లో భాగంగా 2 మ్యాచ్లకు హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఈ మ్యాచ్లను నిర్వహించనుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒక్కో మ్యాచ్ చొప్పున రెండు మ్యాచ్లు ఉండనున్నాయని హెచ్సీఏ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు వెల్లడించారు.