Share News

AP Politics: ఇంతకంటే సిగ్గుచేటు మరోటి లేదు.. వైసీపీపై షర్మిల మాస్ కామెంట్స్..!

ABN , Publish Date - Feb 27 , 2024 | 01:34 PM

AP Politics: క్రికెటర్ ఆనంద్‌‌ విహారీ(Anand Vihari)‌ వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్రంగా స్పందించారు. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా? అని ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు. అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ(YSRCP) వాళ్ళు.. ఇప్పుడు క్రీడలను కూడా వదలడం లేదని విమర్శించారు. వైసీపీ నేతల దౌర్భాగ్య రాజకీయాలకు క్రీడలకు బలి చేయడమేంటని నిలదీశారు.

AP Politics: ఇంతకంటే సిగ్గుచేటు మరోటి లేదు.. వైసీపీపై షర్మిల మాస్ కామెంట్స్..!
YS Sharmila

అమరావతి, ఫిబ్రవరి 27: క్రికెటర్ ఆనంద్‌‌ విహారీ(Anand Vihari)‌ వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్రంగా స్పందించారు. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా? అని ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు. అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ(YSRCP) వాళ్ళు.. ఇప్పుడు క్రీడలను కూడా వదలడం లేదని విమర్శించారు. వైసీపీ నేతల దౌర్భాగ్య రాజకీయాలకు క్రీడలకు బలి చేయడమేంటని నిలదీశారు. క్రీడలు, క్రీడాకారులపై అధికారమదాన్ని చూపుతున్నారని షర్మిల మండిపడ్డారు.

రాష్ట్ర ప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వైసీపీ నేతలు.. ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో ఊహించలేమని షర్మిల వ్యాఖ్యానించారు. ‘ఆడుదాం ఆంధ్ర’ అంటూ రెండు నెలలు సినిమా స్టంట్స్ చేయించిన వైసీపీ నేతలు.. అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా? అని ప్రశ్నించారు. ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా? అని ఫైర్ అయ్యారు. ఇది ఆంధ్ర క్రికెట్ అస్సోసియేషనా లేకా అధ్వానపు క్రికెట్ అస్సోసియేషనా? అని నిలదీశారు. ఈ వ్యవహారంపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని, నిస్పాక్షికమైన విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. క్రీడలు, క్రీడాకారుల విషయంలో వైసీపీ నేతల ఆగడాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఏసీఏకు హనుమ విహారి గుడ్‌బై..

ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ)లో రాజకీయ పెత్తనం మరోసారి రచ్చకెక్కింది. రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు క్వార్టర్‌ఫైనల్‌ చేరడంలో కీలకపాత్ర పోషించిన హనుమ విహారి ఏసీఏలో జరుగుతున్న రాజకీయాలను బహిర్గతం చేశాడు. ఈ ఏడాది రంజీ సీజన్‌ మధ్యలోనే తాను ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వెల్లడించాడు. రాజకీయ నేతల జోక్యంతోనే కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నానని సోషల్‌ మీడియాలో సంచలన పోస్ట్‌ పెట్టాడు. జట్టుకు సంబంధించిన విషయంలో ఓ రాజకీయ నేత కుమారుడైన ఆటగాడితో గొడవ జరిగినందుకు ఏసీఏ పెద్దలు తనపై వేటు వేశారని ఆరోపించాడు. ఇది తనను ఎంతో వేదనకు గురి చేసిందనీ, భవిష్యత్‌లో ఆంధ్ర జట్టుకు ఆడేదే లేదంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 27 , 2024 | 01:35 PM