Home » CWC
Lok Sabha Congress Floor Leader: కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని(Rahul Gandhi) ఆ పార్టీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా(Lok Sabha Floor Leader) బాధ్యతలు చేపట్టాలని సీడబ్ల్యూసీ సమావేశంలో(CWC Meeting) ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venugopal) తెలిపారు.
దక్షిణ భారతదేశాన్ని కరవు పట్టి పీడిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు దక్షిణాది రాష్ట్రాల్లో తాండవిస్తున్నాయి. సీడబ్ల్యూసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో చాలా రిజర్వాయర్లలో నీటిమట్టం అడుగంటిపోయింది.
పశ్చిమబెంగాల్ నుంచి లోక్‌సభకు పోటీ చేసే 12 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఢిల్లీలో సమావేశమైంది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికతో పాటు.. పార్టీ మేనిఫెస్టో(Manifesto)పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను అభినందిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానం చేయనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక మేనిఫెస్టోను రూపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది.
కాంగ్రెస్(Congress) వర్కింగ్ కమిటీ రేపు(మంగళవారం) సమావేశం కానున్నది. ఉదయం 10.00 గంటలకు సీడబ్ల్యూసీ నేతలు భేటీ కానున్నారు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేయనున్నారు. ఐదు న్యాయాల పేరుతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
లోక్‌సభ ఎన్నికల నగారా మోగడంతో కీలకమైన ఎన్నికల మేనిఫెస్టోకు కాంగ్రెస్ పార్టీ తుది మెరుగులు దిద్దుతోంది. ఈనెల 19న జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మేనిఫెస్టోకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.
పార్లమెంటు ఎన్నికలపై ( Parliamentary Elections ) దృష్టి సారించామని, ఆలస్యం చేయకుండా త్వరలోనే లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ( KC Venugopal ) స్పష్టం చేశారు. గురువారం నాడు సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశం గురించి ఆయన మీడియాకు వివరాలు తెలిపారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( CWC ) సమావేశం గురువారం (ఈరోజు) ఏఐసీసీ కార్యాలయంలో జరిగింది. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. నాలుగు గంటల పాటు సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగింది.ఈ సమావేశానికి AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( CWC ) సమావేశం గురువారం (ఈరోజు) ఏఐసీసీ కార్యాలయంలో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశానికి AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) అధ్యక్షత వహించారు. ఖర్గే అధ్యక్షుడిగా నియమించిన తర్వాత మూడోసారి సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికలపై చర్చించారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమవుతోంది. ఈనెల 21వ తేదీన ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారంనాడు పిలుపునిచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై సమావేశంలో చర్చిస్తారు.