Home » Dasara
శరన్నవరాత్రులు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆ క్రమంలో ఎనిమిదవ రోజు.. అంటే దుర్గాష్టమి. దీంతో అమ్మవారు శ్రీదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారు దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షసుడిని సంహారించారు. ఈ నేపథ్యంలో దుర్గాష్టమని భక్తులు జరుపుకుంటారు. ఈ దుర్గాష్టమి రోజు ఆయుధపూజ చేస్తారు.
దసరా, సద్దుల బతుకమ్మ పండుగల(Dasara and Saddula Bathukamma festivals) నేపథ్యంలో ఇటు తెలంగాణ జిల్లాలకు, అటు ఆంధ్రా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) కిటికిటలాడుతోంది. ఒకవైపు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు కావడంతో నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఏడవరోజు బుధవారం అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటేత్తారు.
దసరా, చాత్ పూజ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల కోసం దాదాపు 770 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు తెలిపింది.
శరన్నవరాత్రుల్లో అమ్మవారు.. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆ క్రమంలో ఏడో రోజు అంటే ఆశ్వయుజ మాస శుక్ల పక్ష సప్తమి రోజు దుర్గమ్మవారు.. సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదోరోజు సోమవారం జిల్లా వ్యాప్తం గా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. జిల్లాకేంద్రంలో గుల్జార్ పేటలోని కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవీమాత మూలవిరాట్ను నవధాన్యాలతో, ఆల య ఆవరణలో ఉత్సవమూర్తులను శైలపుత్రిదేవి, గాయత్రిదేవి, సిద్ధిధాత్రి దేవిగా అలంకరించారు.
శరన్నవరాత్రుల్లో భాగంగా దుర్గమ్మ.. సోమవారం అంటే ఈ రోజు..మహాచండి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలోని మహా చండి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తారు.
రూ. 500 కాగితం తీసుకుని కూరగాయల మార్కెట్కు వెళ్లితే.. పట్టుమని మూడు రకాలు కాయగూరలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాదు.. ఉల్లి, వెల్లుల్లి, అల్లం ధరలు సైతం ఇదే తరహాలో కొనసాగుతున్నాయని వారు వివరిస్తున్నారు.
అమ్మవారిని ఆరాధించేందుకు శరన్నవరాత్రులు విశేషమైనవి. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని 9 అలంకారాల్లో పూజిస్తారు. ఈ సందర్బంగా తొమ్మిది రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. ఆ క్రమంలో ఆరో రోజు అంటే.. ఆశ్వయుజ మాస శుక్ల పక్ష షష్టి రోజు.. దుర్గమ్మ వారు.. శ్రీమహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
దసరా శరన్నవరాత్రి ఉత్స వాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం మదనపల్లె పట్ట ణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి లలితాదేవి అలంకరణ లో భక్తులను కటాక్షించారు.