Share News

Deepavali 2024: దీపావళి వేళ.. జస్ట్ ఇలా చేయండి చాలు..

ABN , Publish Date - Oct 29 , 2024 | 06:00 PM

దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకి. అలాంటి పండగ వేళ.. అమ్మవారిని పూజిస్తే చాలు సకల సంపదలు ఇస్తుంది. అమ్మవారు అష్టలక్ష్ముల రూపంలో దర్శనమిస్తారు. ఈ రూపాల్లో అమ్మవారిని దీపావళి వేళ పూజిస్తే మాత్రం అదృష్టం తలుపుతట్టినట్లేనని శాస్త్ర పండితులు చెబుతున్నారు.

Deepavali 2024: దీపావళి వేళ.. జస్ట్ ఇలా చేయండి చాలు..

ఆశ్వయుజ మాసం.. దసరా నవరాత్రులతో మొదలై దీపావళితో ముగిసే మాసం ఇది. ఈ రెండు పండగలు చెడుపై మంచికి ప్రతీకగా ప్రజలంతా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. అయితే దసరా నవరాత్రులు.. తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి. ఇక దీపావళి రోజు.. ఆష్ట లక్ష్ములను పూజించాలి. అలా చేయడం వల్ల భక్తులు అన్ని సమస్యల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుందని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.

Also Read: అడిగిన దానికి సమాధానం చెప్పు.. పోలీస్ పై రఘునందన్ రావు ఫైర్


astalakshmis.jpg

అసలు అయితే దీపావళి పర్వదినం సందర్భంగా లక్ష్మీదేవితోపాటు సర్వ విఘ్నాలను తొలగించే గణపతిని అంతా పూజిస్తారు. కానీ లక్ష్మీదేవి.. అష్ట లక్ష్ములుగా దర్శనమిస్తుంది. దీంతో ఈ రూపాల్లో అమ్మవారిని పూజించడం ద్వారా భక్తులకు ఫలాలను శీఘ్రమే అందిస్తుంది. అంతేకాదు.. అష్ట లక్ష్మీ దేవిల రూపాలు గ్రంధాల్లో సైతం వివరించారు. ఆ క్రమంలో అష్ట లక్ష్మీ పూజాను ఆచరిస్తే.. భక్తులు వెంటనే ప్రయోజనాలు పొందుతారని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు.

Also Read: Dhantrayodashi 2024: ధనత్రయోదశి రోజు ఇలా చేస్తే.. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది


లక్ష్మీదేవి..

అమ్మవారి మొదటి రూపం ఆది లక్ష్మీ. ఆమెను మూల లక్ష్మీ, మహాలక్ష్మీ అని కూడా పిలుస్తారు. శ్రీమద్ భగవత్ పురాణం ప్రకారం.. ఆది లక్ష్మీ విశ్వాన్ని సృష్టించింది. అందులో త్రిమూర్తి స్వరూపాలుగా మహాకాళి, లక్ష్మీదేవి, సరస్వతి దర్శనమిచ్చారు. శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల ఇహ లోకంలో.. పరలోకంలోనూ సుఖంతోపాటు సంపదలు సైతం పొందుతారని వివరిస్తున్నారు.

Also Read: రతన్ టాటా అలా అడుగుతారని అసలు ఊహించ లేదు


ధనలక్ష్మీ

లక్ష్మీదేవి రెండో రూపాన్ని ధనలక్ష్మీ అంటారు. ఆమె ఒక చేతిలో నగదుతో నిండిన కుండను, మరో చేతిలో తామర పువ్వును పట్టుకుని ఉంటుంది. ఈ ధనలక్ష్మీని పూజించడం వల్ల మనిషి జీవితంలో అన్ని రకాల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని అంటారు. అలాగే రుణ విముక్తి లభిస్తుంది. పురాణాల ప్రకారం.. కుబేరుడు నుంచి శ్రీ మహా విష్ణువును విడిపించడానికి అమ్మవారు ఈ రూపాన్ని పొందిందని చెబుతారు.

Also Read: వామ్మో.. సూర్య నమస్కారాలతో ఇన్ని లాభాలున్నాయా..?


ధాన్య లక్ష్మీ..

లక్ష్మీ అమ్మవారి ముచ్చటగా మూడో రూపం ధాన్యలక్ష్మీ. అంటే ఆహార సంపద. ఆమెను అన్నపూర్ణగా భక్తులు కొలుస్తారు. ఈ అమ్మ వారు ప్రతి ఇంటిలోనూ ఆహార రూపంలో కొలువు తీరి ఉంటారు. పలువురు ఆహారాన్ని గౌరవిస్తారు. అంటే.. ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయరని నమ్ముతారు. అలాంటి వారి చర్యలకు సంతసించి.. ధాన్యలక్ష్మీ ఆ ఇంట కొలువు తీరుతుందని అంటారు.


గజలక్ష్మి

లక్ష్మీదేవి నాలుగో రూపం గజలక్ష్మీ. ఈ రూపంలో.. మా గజ్ అంటే ఏనుగుపైన తామర పువ్వుపైన అమ్మవారు కూర్చొని ఉంటుంది. వ్యవసాయానికి, సంతానోత్పత్తికి దేవతగా ఈ గజలక్ష్మీని పూజిస్తారు. లక్ష్మీ దేవిని ఈ రూపంలో పూజించడం ద్వారా సంతానం కలిగి సంతోషం ఆ ఇంట ఉంటుందని విశ్వసిస్తారు.


సంతాన లక్ష్మి

లక్ష్మీ దేవి ఐదవ రూపం సంతాన లక్ష్మీ. ఆమె స్కందమాత రూపాన్ని పోలి ఉంటుంది. బాల లక్ష్మీ రూపం సైతం దాదాపు అలాంటిదే. ఆమెకు నాలుగు చేతులుంటాయి. అమ్మవారి ఒడిలో పిల్లల రూపంలో కుమార స్కందునితో కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవి తన పిల్లల రూపంలో భక్తులను రక్షిస్తుందని విశ్వసిస్తారు.


వీర లక్ష్మి

లక్ష్మీదేవి ఆరో రూపం వీర లక్ష్మీ దేవి. ఈ రూపంలో భక్తులకు ధైర్యాన్ని, శక్తిని అందిస్తుందని అంతా విశ్వసిస్తారు. ఈ రూపంలో అమ్మవారికి ఎనిమిది చేతులుంటాయి. ఆయా చేతుల్లో వివిధ రకాల ఆయుధాలు ఉంటాయి. ఈ రూపంలో అమ్మవారిని కొలిస్తే.. భక్తులకు అకాల మరణాలతోపాటు అప మృత్యు దోషాలు సైతం తొలుగుతాయని వారు చెబుతారు. ఆమ్మవారిని పూజిస్తే.. యుద్దంలో విజయాన్ని అందిస్తుంది. అమ్మవారి అనుగ్రహం కారణంగా.. అదృష్టం, శ్రేయస్సులను భక్తులు పొందుతారని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు.


విజయలక్ష్మి

లక్ష్మీదేవి ఏడవ రూపం విజయలక్ష్మి. ఈ రూపంలో అమ్మవారిని జయలక్ష్మీ అని కూడా అంటారు. అమ్మవారిని ఈ రూపంలో పూజించడం ద్వారా.. భక్తులు జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. ఈ జయలక్ష్మీ రూపంలో అమ్మవారిని పూజిస్తే మాత్రం కీర్తితోపాటు గౌరవం సైతం దక్కుతుంది. అలాగే అమ్మవారిని పూజించడం వల్ల ప్రతి సమస్యను అదిగమించవచ్చు.


విద్యాలక్ష్మి

లక్ష్మీదేవి ఎనిమిదో రూపం విద్యాలక్ష్మీ. ఈ రూపంలో అమ్మవారు జ్ఞానం, కళలతోపాటు నైపుణ్యాలను సైతం భక్తులకు ఇస్తుంది. ఈ రూపాన్ని పూజించడం వల్ల విద్యారంగంలో విజయం చేకూరుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

మరిన్నీ ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 29 , 2024 | 06:00 PM