Home » Delhi Capitals
ఐపీఎల్-2024 సీజన్ జోరుగా సాగుతున్న తరుణంలో.. ఈసారి ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందనే చర్చలు క్రీడా వర్గాల్లో సాగుతున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఇతర జట్లు కూడా దూకుడుగా రాణిస్తున్నాయి కాబట్టి.. ఏ జట్టు టైటిల్ సొంతం చేసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ ఐపీఎల్ సీజన్లో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి తాజాగా ఓ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఒకరు దూరం అవ్వాల్సి వచ్చింది. ఇంతకీ.. ఆ ఆటగాడు ఎవరని అనుకుంటున్నారా?
ఒక్కోసారి ఆటగాళ్లు మైదానంలో సహనం కోల్పోతుంటారు. తమకు అనుకూలంగా తీర్పు రానప్పుడు.. అంపైర్లపై కోపం ప్రదర్శిస్తుంటారు. వాళ్లతో గొడవలకు దిగుతుంటారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా అదే పని చేశాడు.
భారత యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తాజాగా ఓ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో మూడు వేల పరుగుల మైలురాయిని దాటేసి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా.. పంత్ ఈ ఫీట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ 2024లో (IPL 2024) వరుస ఓటములతో ఢిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals) డీలాపడింది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఢిల్లీ 29 పరుగుల తేడాతో ఓడింది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదటి రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ వేశాడు కానీ, ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం బంతిని ముట్టలేదు. ఒక్కటంటే ఒక్క ఓవర్ కూడా వేయలేదు. దీంతో.. హార్దిక్ ఎందుకు బౌలింగ్ వేయలేదన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది.
వండర్స్ క్రియేట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే ముంబై ఇండియన్స్ జట్టు తాజాగా ఓ చారిత్రాత్మక రికార్డ్‌ని నమోదు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలో (ఐపీఎల్, సీఎల్టీ20తో కలిపి) 150 విజయాలు సాధించిన మొట్టమొదటి జట్టుగా సంచలన రికార్డ్‌ని సృష్టించింది.
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
ఐపీఎల్ 2024(IPL 2024) రసవత్తరంగా సాగుతోంది. బ్యాటర్లు పరుగుల వరద పారిస్తుంటే.. బౌలర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. ఫీల్డర్లు తమ విన్యాసాలతో ఆకట్టుకుంటున్నారు. చూస్తుండగానే 16 మ్యాచ్‌లు ముగిశాయి. జట్లన్నీ 3 మ్యాచ్‌ల చొప్పున ఆడేశాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ డేంజర్ జోన్లో ఉన్నాడు. ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడ్డాడు. దీంతో పంత్‌కు ఐపీఎల్ నిర్వహకులు భారీగా జరిమానా విధించారు. గత మ్యాచ్‌లో విధించిన జరిమానా కన్నా ఇది రెండింతలు కావడం గమనార్హం. అంతేకాకుండా ఈ సారి జట్టులోని సభ్యులందరికీ కూడా జరిమానా విధించారు.