Share News

IPL 2024: డేంజర్ జోన్‌లో రిషబ్ పంత్.. మరొక తప్పు చేస్తే..

ABN , Publish Date - Apr 04 , 2024 | 03:23 PM

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడ్డాడు. దీంతో పంత్‌కు ఐపీఎల్ నిర్వహకులు భారీగా జరిమానా విధించారు. గత మ్యాచ్‌లో విధించిన జరిమానా కన్నా ఇది రెండింతలు కావడం గమనార్హం. అంతేకాకుండా ఈ సారి జట్టులోని సభ్యులందరికీ కూడా జరిమానా విధించారు.

IPL 2024: డేంజర్ జోన్‌లో రిషబ్ పంత్.. మరొక తప్పు చేస్తే..

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్(Rishabh Pant) డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడ్డాడు. దీంతో పంత్‌కు ఐపీఎల్ నిర్వహకులు భారీగా జరిమానా విధించారు. గత మ్యాచ్‌లో విధించిన జరిమానా కన్నా ఇది రెండింతలు కావడం గమనార్హం. అంతేకాకుండా ఈ సారి జట్టులోని సభ్యులందరికీ కూడా జరిమానా విధించారు. ఈ సీజన్‌లో కెప్టెన్‌గా పంత్ మరోసారి ఇలాంటి తప్పిదానికి పాల్పడితే భారీగా జరిమానా విధించడంతోపాటు ఓ మ్యాచ్ నుంచి నిషేధం కూడా ఎదుర్కొవలసి ఉంటుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ 2024లో (IPL 2024) భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals vs Kolkata Knight Riders) బుధవారం మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ సునీల్ నరైన్( Sunil Narine) అయితే పరుగుల వరద పారించాడు. 7 ఫోర్లు, 7 సిక్సులతో 39 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు.


అలాగే అరంగేట్ర బ్యాటర్ అంక్రిష్‌ రఘువంశీ (Angkrish Raghuvanshi) 27 బంతుల్లోనే 54 పరుగులతో చెలరేగాడు. డెత్ ఓవర్లలో రస్సెల్ 19 బంతుల్లోనే 41, రింకూ సింగ్ 8 బంతుల్లోనే 26 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల భారీ స్కోర్ చేసింది. కోల్‌కతా బ్యాటర్ల ఊచకోత ముందు ఢిల్లీ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్ మినహా మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఢిల్లీ 166 పరుగులకే ఆలౌట్ అయింది. 106 పరుగుల తేడాతో కోల్‌కతా గెలిచింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీతో చెలరేగిన పంత్ 4 ఫోర్లు, 5 సిక్సులతో 25 బంతుల్లో 55 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, 4 సిక్సులతో స్టబ్స్ 32 బంతుల్లో 54 పరుగులు చేశాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ ఆరోరా మూడేసి వికెట్లు.. స్టార్ 2, రస్సెల్, నరైన్ తలో వికెట్ తీశారు.

అయితే కోల్‌కతా బ్యాటింగ్ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడింది. ఈ సీజన్‌లో ఢిల్లీ స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడడం ఇది వరుసగా రెండో సారి కావడం గమానర్హం. చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఆ జట్టు బౌలర్లు స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడ్డారు. దీంతో ఐపీఎల్ నిర్వహకులు పంత్‌కు రూ.24 లక్షల జరిమానా విధించారు. ఈ తప్పిదం జరగడం రెండోసారి కావడంతో మ్యాచ్ ఆడిన తుది జట్టులోని అందరు సభ్యులతోపాటు ఇంపాక్ట్ ప్లేయర్ అభిసేక్ పోరేల్‌కు కూడా జరిమానా విధించారు. వారందరికీ వారి మ్యాచ్‌లో 25 శాతం లేదా రూ.6 లక్షలు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానిని జరిమానాగా కట్టవలసి ఉంటుంది.


ఇక కెప్టెన్‌గా పంత్ మరోసారి ఇలాంటి తప్పిదానికి పాల్పడితే రూ.30 లక్షల జరిమానాతోపాటు ఓ మ్యాచ్ నిషేధం కూడా ఎదుర్కొవలసి ఉంటుంది. అదే జరిగితే ఢిల్లీకి భారీ ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి. అలాగే పంత్ ఇప్పుడు డేంజర్ జోన్‌లో ఉన్నాడు. మిగతా మ్యాచ్‌ల్లోనైనా ఓవర్లను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చూసుకోవడం మంచిదని పంత్‌కు క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ తప్పిదం కారణంగా జరిమానా ఎదుర్కొన్న మొదటి కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: రోహిత్ మనసు బంగారం.. హార్దిక్ కోసం ఏం చేశాడో చూడండి..

MI vs RR: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన ఒకే ఒక జట్టుగా..

Updated Date - Apr 04 , 2024 | 03:29 PM