Home » Delhi Capitals
ఐపీఎల్ 2024(Ipl 2024)లో నేడు విశాఖపట్నం(Visakhapatnam)లోని వైఎస్సార్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ 2024లో ఢిల్లీకి ఇది నాలుగో మ్యాచ్ కాగా కోల్‌కతా మూడో మ్యాచ్ ఆడనుంది.
ఐపీఎల్ 2024లో తొలి విజయం సాధించిన జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన రిషబ్ పంత్‌కు భారీగా జరిమానా పడింది. విశాఖపట్నం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ పాలక మండలి పంత్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది.
చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు చెలరేగారు. టాపార్డర్ బ్యాటర్లు రిషబ్ పంత్(51), డేవిడ్ వార్నర్(52) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. వీరికి తోడు యువ ఓపెనర్ పృథ్వీషా(43) కూడా రాణించాడు. దీంతో చెన్నైసూపర్ కింగ్స్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో చెన్నైసూపర్ కింగ్స్ ముందుగా ఫీల్డింగ్ చేయనుంది.
ఈరోజు ఐపీఎల్ 2024(ipl 2024)లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు విశాఖపట్నం(Visakhapatnam) మైదానంలో 13వ మ్యాచ్ జరగనుంది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని సీఎస్కే(CSK) జట్టు పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో ఉంది.
జైపూర్‌లోని సవాయి మాన్సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి రంగంలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా.. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. సాయంత్రం 7 గంటలకు టాస్ వేయగా.. ఢిల్లీ జట్టు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ సీజన్లో ఇరు జట్లు ఇప్పటివరకూ చెరో మ్యాచ్ ఆడాయి.
ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో రాణించిన పంజాబ్ ఢిల్లీపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. హాఫ్ సెంచరీతో చెలరేగిన సామ్ కర్రాన్(63) పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. లివింగ్‌స్టోన్(38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు నెలకొల్పిన హాఫ్ సెంచరీ భాగస్వామ్యం జట్టును గెలుపు బాట పట్టింది.
ఐపీఎల్ 2024లో శుక్రవారం నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాటం మొదలుకానుంది. గతేడాది ఫేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ ఈ సారి సత్తా చాటాలని భావిస్తోంది. కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ ఆధ్వర్యంలో ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది.
పంజాబ్ బౌలర్లు కలిసికట్టుగా కట్టడి చేసినప్పటికీ.. చివర్లో అభిషేక్ పోరెల్(10 బంతుల్లో 32) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి స్కోర్ సాధించింది. పంజాబ్ కింగ్స్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. మంచి ఆరంభం లభించినప్పటికీ దానిని కొనసాగించలేకపోయారు. ముఖ్యంగా మిడిలార్డర్ వైఫల్యం ఢిల్లీకి మైనసైంది.