Share News

Rishabh Pant: రిషభ్ పంత్‌కి భారీ ఎదురుదెబ్బ.. ఒక మ్యాచ్ నిషేధం.. ఎందుకంటే?

ABN , Publish Date - Apr 28 , 2024 | 02:49 PM

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు భారీ ఎదురుదెబ్బ తగలనుందా? అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించనున్నారా? అంటే దాదాపు అవుననే సూచనలు కనిపిస్తున్నాయి. రిషభ్ చేసిన ఓ తప్పు కారణంగానే, అతనికి ఈ శిక్ష పడే అవకాశం ఉందని...

Rishabh Pant: రిషభ్ పంత్‌కి భారీ ఎదురుదెబ్బ.. ఒక మ్యాచ్ నిషేధం.. ఎందుకంటే?

ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కెప్టెన్ రిషభ్ పంత్‌కు (Rishabh Pant) భారీ ఎదురుదెబ్బ తగలనుందా? అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించనున్నారా? అంటే దాదాపు అవుననే సూచనలు కనిపిస్తున్నాయి. రిషభ్ చేసిన ఓ తప్పు కారణంగానే, అతనికి ఈ శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంతకీ అతను చేసిన తప్పేంటని అనుకుంటున్నారా.. స్లో ఓవర్‌రేట్ (Slow Over Rate). శనివారం ముంబై ఇండియన్స్‌తో (Mumbai Indians) జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బైలర్లు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేదు. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టు ఇలా స్లో ఓవర్‌రేట్‌తో బౌలింగ్ చేయడం ఇది మూడోసారి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. మూడోసారి స్లో ఓవర్‌రేట్‌తో బౌలింగ్ చేస్తే.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై 100 శాతం మ్యాచ్ ఫీజుపై కోత విధించడంతో పాటు ఒక మ్యాచ్ నిషేధం (మ్యాచ్ రిఫరీ విచక్షణ మేరకు) విధిస్తారు. అదే జరిగితే.. ఢిల్లీ జట్టుకి పెద్ద నష్టమే!


నాకు చోటు దక్కకపోతే ఆ పని చేస్తా.. శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జేక్ ఫ్రేసర్ (84) విధ్వంసం సృష్టించడంతో పాటు హోప్ (41), స్టబ్స్ (48), పోరెల్ (36), పంత్ (29) మెరుపులు మెరిపించడంతో.. ఢిల్లీ జట్టు ముంబైకి 258 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేధనలో భాగంగా.. ముంబై జట్టు చివరివరకూ గట్టిగానే పోరాడింది కానీ, 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాపార్డర్ విఫలం కావడమే ఆ జట్టు పాలిట శాపమైంది. తమ జట్టుని విజయతీరాలకు చేర్చేందుకు తిలక్ వర్మ (63), హార్దిక్ పాండ్యా (46), టిమ్ డేవిడ్ (37) పోరాడారు కానీ.. చివరికి వారి కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చినందుకు జేక్ ఫ్రేసర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ గెలుచుకున్నాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Apr 28 , 2024 | 02:52 PM