Home » Devineni Avinash
వైసీపీ అధినేత జగన్‌కు దమ్ముంటే ఇప్పుడు అమెరికా వెళ్లమనండి. ఇక జీవితాంతం ఆయన తిరిగి ఏపీకి రాలేరని తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో అడ్డగోలుగా వాగిన వారంతా జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందేనని బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Andhrapradesh: టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు జోగిరమేశ్, అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై శుక్రవారం సుప్రీంలో విచారణ జరింది. విచారణకు సహకరించాలని జోగిరమేశ్, అవినాశ్‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టీడీపీ (Telugu Desam) కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మిగిలింది పెద్ద తలకాయలు మాత్రమే.. ఇందులోనూ ఇద్దరు ముగ్గురు అరెస్ట్ కాగా.. మరికొందరి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. అయితే.. అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు...