Home » Dharmana Krishna Das
వైసీపీ నేత.. ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ గొండు మురళీ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలపై ఇటీవల ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఏసీబీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ అతుల్‌సింగ్ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. గురువారం జిల్లాతోపాటు విశాఖలోనూ ఏకకాలంలో ఆరు చోట్ల తనిఖీలు నిర్వహించారు.