Share News

Srikakulam: మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు పీఏ గొండు మురళి అరెస్టు

ABN , Publish Date - Nov 29 , 2024 | 08:49 AM

వైసీపీ నేత.. ధర్మాన కృష్ణదాస్‌ మాజీ పీఏ గొండు మురళీ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలపై ఇటీవల ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఏసీబీ డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ అతుల్‌సింగ్‌ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. గురువారం జిల్లాతోపాటు విశాఖలోనూ ఏకకాలంలో ఆరు చోట్ల తనిఖీలు నిర్వహించారు.

Srikakulam:  మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు పీఏ గొండు మురళి అరెస్టు

శ్రీకాకుళం జిల్లా: మాజీ డిప్యూటీ సీఎం (Ex Deputy CM) ధర్మాన కృష్ణదాస్ (Dharmana Krishnadas) పీఏ గోండు మురళి (PA Gondu Murali) ఇంట్లో ఏసీబీ (ACB) అధికారులు గురువారం ఉదయం నుంచి జరిపిన సోదాలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. సుమారు రూ. 60 కోట్ల మేర అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు మురళిని అరెస్ట్ (Arrest) చేసి.. అర్ధరాత్రి విశాఖపట్నం తరలించి... ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు.

కాగా వైసీపీ నేత.. ధర్మాన కృష్ణదాస్‌ మాజీ పీఏ గొండు మురళీ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలపై ఇటీవల ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఏసీబీ డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ అతుల్‌సింగ్‌ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. గురువారం జిల్లాతోపాటు విశాఖలోనూ ఏకకాలంలో ఆరు చోట్ల తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తన బృందంతో మురళీ నివాసంతోపాటు విధులు నిర్వహించిన చోట, బంధువుల ఇళ్లల్లో సోదాలు చేపట్టారు.


మురళీ స్వగ్రామం.. జలుమూరు మండలం లింగన్నాయుడుపేటలోని ఇంట్లో ఏసీబీ సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. అలాగే మురళీ పనిచేస్తున్న సారవకోట మండలం బుడితి సీహెచ్‌సీలో కూడా సీఐ సుప్రియ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. మురళీ కారుతోపాటు ఆయన కంప్యూటర్‌ను పరిశీలించి కొంత సమాచారం సేకరించారు. వీఆర్వో రామారావు, పంచాయతీ కార్యదర్శి ధర్మరాజు నుంచి వివరాలు సేకరించారు. ఉదయం 5.30 నుంచి రాత్రి వరకూ సోదాలు చేసిన ఏసీబీ అధికారులు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. లింగన్నాయుడుపేట ఇంట్లో మురళీ తల్లి పద్మావతి, అక్క అరుణ, వదిన శ్యామల నివసిస్తున్నారు. ఏసీబీ సోదాలతో లింగన్నాయుడుపేటతోపాటు పరిసర గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు.

ప్రస్తుతం మురళీ.. అత్తవారి ఊరు కోటబొమ్మాళి మండలం దంత గ్రామంలోని కుటుంబంతో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటున్నాడు. దంతలో కూడా ఆస్తులు బాగా కూడగట్టాడు. దీంతో ఏసీబీ ఎస్పీ రజనీ పర్యవేక్షణలో డీఎస్పీ రమణమూర్తి, సీఐ భాస్కరరావు ఆధ్వర్యంలో దంత గ్రామంలో కూడా రెండు చోట్ల సోదాలు చేశారు. అలాగే శ్రీకాకుళం నగరంలోనూ, విశాఖపట్నం జిల్లా గాజువాక, మధురవాడ ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లల్లో కూడా తనిఖీ చేశారు.

ధర్మాన కృష్ణదాస్‌ పీఏగా చేరకముందు గొండు మురళీ.. సారవకోట మండలం బుడితి సీహెచ్‌సీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. కృష్ణదాస్‌ పీఏగా చేరిన తర్వాత ఆయన స్థాయి మారిపోయింది. 2019 నుంచి రెండున్నరేళ్ల వరకు ధర్మాన కృష్ణదాస్‌ ఉపముఖ్యమంత్రిగానూ, మంత్రిగానూ వ్యవహరించారు. ఆ సమయంలో పీఏగా మురళీ హవా అంతా ఇంతాకాదు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల బదిలీల్లో ప్రత్యక్షంగానూ.. శ్రీకాకుళం జిల్లా అధికారులతో నేరుగా వ్యవహారాలను నడిపేవిషయంలో కీలకంగానే వ్యవహరించారు. అప్పటి నుంచే మురళీపై అందరి దృష్టి పడింది. గతంలో ఈయనపై అవినీతి ఆరోపణలు వచ్చినా.. అధికార బలంతో వాటిని మేనేజ్‌ చేశాడు. తాజాగా ప్రభుత్వం మారడంతో ఏసీబీకి మురళీ బాగోతంపై ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు దాడులు చేయగా.. ఆయన కూడబెట్టుకున్న అక్రమాస్తులు బయటపడ్డాయి. ఇందులో అన్నీ స్థిరాస్తులే అధికం. కాగా.. వైసీపీ పాలనలో హవా నడిపి.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ బుడితి సీహెచ్‌సీలో ఉద్యోగం చేస్తుండడం గమనార్హం.

అక్రమాస్తులు ఇవీ..

శ్రీకాకుళంలో ఓ ఇల్లు, కోబొమ్మాళి మండలం దంత గ్రామంలో మూడు ఇళ్లు, మధురవాడలో ఫ్లాట్‌, గాజువాకలో ఇల్లు, కోటబొమ్మాళిలో ఓ ఇల్లు, శ్రీకాకుళం జిల్లాలో నాలుగు హౌస్‌ ఫ్లాట్స్‌, విశాఖ జిల్లా పెందుర్తిలో ఒక ఇంటి ఫ్లాట్‌, విజయనగరం జిల్లా భోగాపురంలో ఇంటి ఫ్లాట్‌ ఉన్నట్టు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో 15 ఎకరాల 47 సెంట్ల వ్యవసాయ భూమి, 6 ఎకరాల 5 సెంట్ల మెట్ట భూమి, ఇంటిలో 520 గ్రాముల బంగారు ఆభరణాలు, బ్యాంకు లాకర్‌లో 536 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇంటిలో 11కిలోల 36 గ్రాముల వెండి వస్తువులు, బ్యాంకు ఖాతాలో రూ. 43,223, ఒక మారుతీ కారు(ఇగ్నిస్‌), ఒక బుల్లెట్‌ మోటార్‌ సైకిల్‌.. ఉన్నట్లు ఏసీబీ తనిఖీలో వెల్లడైంది. ఈ ఆస్తులన్నీ అతని పేరుతోనూ, అతని బంధువుల పేరుతోనూ కూడబెట్టుకున్నట్లుగా ఏసీబీ అధికారులు నిర్ధారించారు. అలాగే డిఫెన్స్‌కు చెందిన 5 లిక్కర్‌ బాటిళ్లు, ఒడిశా రాష్ట్రానికి చెందిన మరో ఐదు లిక్కరు బాటిళ్లు తనిఖీలో లభించాయి. దీంతో కోటబొమ్మాళి ఎక్సైజ్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

దర్జాగా రోడ్డు దాటుతూ స్థానికుల కంట పడ్డ పులి

ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు

తీరంలో కనకం వేట

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 29 , 2024 | 01:15 PM