Home » District
ఎన్నికల సమయంలో ఏపీటీఎఫ్ నాయకులు సమావేశం ఏర్పాటు చేయడంపట్ల ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి ఆ యూనియన నాయకులను, రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్ హెచఎంను శుక్రవారం విచారించినట్లు తెలిసింది. ఆ పాఠశాలో ఎలాంటి సమావేశం నిర్వహించలేదని ...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం అనంతపురం నగరానికి వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని సప్తగిరి సర్కిల్లో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు హాజరవుతారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకూ నిర్వహించే ఎన్నికల బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమితషాతో కలిసి చంద్రబాబు ...
ఉరవకొండ ఎంపీడీఓ అమృతరాజ్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ నుంచి ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ఆయన కర్నూలు జిల్లాలో ప్యాపిలి ఎంపీడీఓగా పనిచేశారు. ఆ సమయంలో ఉపాధి పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించడం, నిధులను దుర్వినియోగం చేయడంతో ఆయనను డిస్మిస్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కలెక్టరేట్‌కు సమాచారం వచ్చింది. పంచాయతీరాజ్ ...
టీడీపీ కండువా వేసుకుని మాకే ఎదురుగా వస్తావా? ఎంత ధైర్యంరా నీకు’ అంటూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి, అతడి అనుచరులు టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడిన సంఘటన మండలంలోని గువ్వలగొందంపల్లిలో గురువారం జరిగింది. బాధితుడు టీడీపీ కార్యకర్త బెల్లం వేణుగోపాల్ తెలిపిన మేరకు.. తమ బంధువు చనిపోవడంతో కుటుంబసభ్యులతో కలిసి పరామర్శించి తిరిగి కారులో స్వగ్రామమైన గువ్వలగొందంపల్లికి బయల్దేరారు. న్యామద్దల గ్రామ శివారులోకి రాగానే ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన సోదరుడు...
డిగ్రీలో సబ్జెక్టులు మిగిలిపోయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఎస్కేయూ యాజమాన్యం నిర్ణయించింది. దీంతో పరీక్షల కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఊరట లభించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సప్లిమెంటరీ పరీక్షలకు కొర్రీలు పెడుతూ వచ్చింది. దీంతో డిగ్రీ విద్యార్థులు ఫెయిల్ అయిన ఎస్కేయూ విద్యార్థులు సబ్జెక్టులను పూర్తిచేసుకోలేకపోయారు. ఈ సమస్యపై ఆంధ్రజ్యోతిలో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. అప్పటి వీసీ రామకృష్ణారెడ్డి తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆయన వైసీపీ నాయకుడి తరహాలో ...
ఎన్నికల ప్రచారంలో సీఎం జగన ‘పేలవ ప్రదర్శన’ కొనసాగుతోంది. వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకువస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, టీడీపీ అధికారంలోకి వస్తే ఆగిపోతాయని జనాన్ని బెదిరించి, లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. తాడిపత్రి వైఎస్సార్ సర్కిల్‌లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చామని అన్నారు. నవరత్నాల్లోని అన్ని పథకాలను అమలు చేశామని అన్నారు. కానీ ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, పోలవరం ప్రాజెక్ట్, సీపీఎస్ రద్దు, మెగా...
మండల పరిధిలోని కేఎస్ దొడ్డి గ్రామానికి చెందిన ఈఽశ్వరప్ప(40) వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామ సమీపంలోని కొండపై ఉన్న తమ ఇలవేల్పు దర్శనానికి శుక్రవారం కాలినడకన వెళ్లివచ్చిన ఈశ్వరప్ప తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని శుక్రవారం ..
పట్టణంలోని కథల వీధిలో గర్భిణి మాధవికి అబార్షన చేసి.. ఆమె ప్రాణాలను బలితీసుకున్న ఫర్హానా, ఆమె తల్లి ఖురేషిపై ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా పీపీ యూనిట్ అధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి శనివారం టూటౌన పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేశారు. వజ్రకరూరుకు చెందిన గర్భిణి మాధవికి వీరు అనధికారికంగా తమ ఇంట్లో అబార్షన చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మృతిచెందారు. ఫర్హానా ఇంటిని డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి, డీపీఎంఓ ...
జనంలో ఇంకా మార్పు రాలేదు. కొడుకులకు దీటుగా, ఆ మాటకొస్తే.. కొడుకులకు మించి కూతుళ్లు దూసుకుపోతున్నా.. ఆమెపట్ల ఇంకా వివక్ష కొనసాగుతోంది. వారసుడు కావాలి అనే యావలో.. కూతురు అని తెలియగానే గర్భంలోనే ప్రాణం తీస్తున్నారు. లింగ నిర్ధారణ నేరమని తెలిసినా.. కాసులకు కక్కుర్తిపడి కొన్ని స్కానింగ్ సెంటర్లలో చెప్పేస్తున్నారు. భ్రూణ హత్యలకు పరోక్షంగా సహకరిస్తున్నారు. అలాంటి ఘటనే గుంతకల్లులో జరిగింది...
జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తి అయ్యింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు అన్నీ ఆమోదం పొందడంతో ఆయా పార్టీల నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఎంపీ స్థానానికి 21 మంది నామినేషన్లు, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 136 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. షెడ్యూల్ మేరకు ఈ నెల 18నుంచి 25 వరకు అనంతపురం ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ...