Share News

INVESTIGATION : అబార్షన మరణంపై విచారణ

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:40 AM

పట్టణంలోని కథల వీధిలో గర్భిణి మాధవికి అబార్షన చేసి.. ఆమె ప్రాణాలను బలితీసుకున్న ఫర్హానా, ఆమె తల్లి ఖురేషిపై ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా పీపీ యూనిట్‌ అధికారి డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి శనివారం టూటౌన పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేశారు. వజ్రకరూరుకు చెందిన గర్భిణి మాధవికి వీరు అనధికారికంగా తమ ఇంట్లో అబార్షన చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మృతిచెందారు. ఫర్హానా ఇంటిని డీఎంహెచఓ డాక్టర్‌ ఈబీ దేవి, డీపీఎంఓ ...

INVESTIGATION : అబార్షన మరణంపై విచారణ
Qureshi's house is under siege by medical officials

పోలీసులకు వైద్యాధికారుల ఫిర్యాదు

గుంతకల్లు టౌన, ఏప్రిల్‌ 27: పట్టణంలోని కథల వీధిలో గర్భిణి మాధవికి అబార్షన చేసి.. ఆమె ప్రాణాలను బలితీసుకున్న ఫర్హానా, ఆమె తల్లి ఖురేషిపై ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా పీపీ యూనిట్‌ అధికారి డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి శనివారం టూటౌన పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేశారు. వజ్రకరూరుకు చెందిన గర్భిణి మాధవికి వీరు అనధికారికంగా తమ ఇంట్లో అబార్షన చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మృతిచెందారు. ఫర్హానా ఇంటిని డీఎంహెచఓ డాక్టర్‌ ఈబీ దేవి, డీపీఎంఓ డాక్టర్‌ రవిశంకర్‌, డెమో సెక్షన అధికారులు ఉమాపతి,


త్యాగరాజు శనివారం పరిశీలించారు. తల్లి, కూతురు కొన్నేళ్ల నుంచి అనధికారికంగా ఇంట్లోనే కాన్పులు, అబార్షనలు చేస్తున్నారని గుర్తించారు. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఖురేషి ఆయాగా పనిచేసింది. ఆమె కూతురు ల్యాబ్‌ టెక్నిషియనగా పనిచేసింది. ఆమె ఏఎనఎం కోర్సు చేసినట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. వారి ఇంటిని సీజ్‌ చేశారు. తల్లీకూతుళ్లను విచారిస్తే.. లింగ నిర్ధారణ, భ్రూణ హత్యల గురించి మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.

మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 12:40 AM