Home » Districts
డ్రైవింగ్ లైసెన్స కోసం వెళ్లే వారికి సెన్సర్ కష్టాలు తీరడం లేదు. ఈక్రమంలోనే చాలా మంది డ్రైవింగ్ పరీక్షలో ఫెయిల్ అవుతున్నారు. 2022 నుంచి అనంతపురం ఆర్టీఏ కార్యాలయంలో డ్రైవింగ్ పరీక్షల్లో సెన్సర్ సేవలు మొదలయ్యాయి. ఆటోమేటిక్ ట్రాక్పై వాహనం ఎలా నడపాలో అవగాహన లేక ఎక్కువ శాతం మంది వాహనదారులు ఫెయిల్ అవుతున్నారన్న అభిప్రాయాలున్నాయి. డ్రైవింగ్ పరీక్షకు ముందుగా ఆటోమెటిక్ ...
మండల పరిధిలోని హనకనహాళ్ రామాలయ ఉత్సవ రథానికి దుండగులు నిప్పు పెట్టారు. సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన మూలింటి ఎర్రిస్వామి రెడ్డి కుటుంబ సభ్యులు రూ.19 లక్షలు వెచ్చించి మూడేళ్ల క్రితం రథాన్ని తయారు చేయించి పురాతన రామాలయానికి సమర్పించారు. రథాన్ని భద్రపరిచేందుకు ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో రథాన్ని గ్రామంలో ఊరేగించి, యథాస్థానంలో..
దిగుబడితో పాటు ధర కూడా బాగుండటంతో ఈ ఏడాది సజ్జ పంట సాగు చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వేరుశనగను సాగు చేసి నష్టపోయిన రైతులు సజ్జ పంట వైపు మెగ్గుచూపారు. గడిచిన పదేళ్ల నుంచి పత్తి, వేరుశనగ, ఆముదం పంటలను సాగుచేస్తూ రైతులు నష్టల చవిచూశారు. తెగుళ్లు సోకడం, వర్షాభావం వల్ల దిగుబడులు రానేలేదు. దీంతో రైతులు ఈ ఏడాది సంప్రదాయ పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటలైన సజ్జ, కొర్ర, జొన్న పంటలను సాగు చేశారు. జక్కలచెరువు, తొండపాడు,...
జడ్పీ ఉద్యోగుల బదిలీలకు బహిరంగ వేలంపాటలు జరుగుతున్నాయి. ‘లచ్చ.. లచ్చన్నర... అంతకు మించి..’ అని పోటీ పడుతున్నారు. హాట్ సీటు కోసం భారీగా బేరాలకు దిగుతున్నారు. సాధారణ బదిలీలను అడ్డు పెట్టుకుని కొందరు అధికారులు, ఉద్యోగులు ఇలా పోటీ పెట్టి దండుకుంటున్నారు. జడ్పీలో ఏవో, సీనియర్ అసిస్టెంట్ సీట్లను అమ్మకానికి పెట్టారు. 22వ తేదీనే (కటాఫ్ డేట్) బదిలీల ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉన్నా.. 23వ ...
జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఆదివారం ఆయన జిల్లాకు వచ్చారు. ముందుగా హంద్రీనీవా ప్రాజెక్టు పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ను సందర్శించారు. అనంతరం అనంతపురానికి వచ్చిన మంత్రి రోడ్లు, భవనాల అతిథి గృహంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ర్టానికి జలవనరులే అత్యంత కీలకమని, ముఖ్య మంత్రి ...
పుట్టిన రోజే తనకు చివరి రోజు అవుతుందని ఆ యువకుడు ఏమాత్రం ఊహించి ఉండడు. స్నేహితులతో కలిసి చేసుకున్న బర్త్డే వేడుకలే అంత్యక్రియలకు కారణమవుతాయని అనుకుని ఉండడు. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలే తమకు చివరి క్షణాలు అవుతాయని ముగ్గురు యువకులు ఊహించి ఉండరు. అందుకే బర్త్డే బాయ్తో కలిసి ఎంతో ఆనందంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మరో స్నేహితుడు వద్దు వద్దంటున్నా సతాయించి టిఫిన తినడానికని అతడి కారు తీసుకెళ్లారు. అనంతరం ఎందుకు బుద్ధి పుట్టిందో తెలియదు గానీ ...
స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖలో అక్రమాదాయానికి కొదవ ఉండదనేది బహిరంగ రహస్యమే. అలాంటి శాఖలో బదిలీలు అంటే మామూలు విషయం కాదు. కొన్ని సీట్లు భారీగా విలువ పలుకుతున్నట్లు ఆ శాఖలో చర్చ సాగుతోంది. ఎంతైనా ఇచ్చుకునేందుకు పలువురు అధికారులు కూడా సిద్ధమైనట్లు సమాచారం. ఆ శాఖలో ప్రస్తుతం బదిలీల గోల సాగుతోంది. ముందు క్యాష్ కొట్టు... పోస్టు పట్టు అనే నినాదం వినిపిస్తోంది. ఆ శాఖలో సబ్రిజిస్ర్టార్లదే హవా. ఆ తరువాత ఇనచార్జిగా పనిచేసే...
స్టాంపులు, రిజిస్ట్రేషనల శాఖలో ప్రైవేటు పెత్తనం కొనసాగుతోంది. వారు జారీ చేస్తేనే స్టాంపులు వేసుకునే దుస్థితి నెలకొంది. రెండు వారాలుగా జిల్లాలో ఈ-స్టాంపుల కొరత ఏర్పడింది. దీంతో క్రయ విక్రయదారులు ఇక్కట్లు పడుతున్నారు. అదనపు ధరలకు విక్రయించినా ఇన్నాళ్లూ కొనుగోలు చేశారు. ఇప్పుడేమో నో స్టాక్ అంటున్నారు. 2022లో వైసీపీ ప్రభుత్వం ఈ-స్టాంపింగ్ విధానాన్ని తెచ్చింది. వాటి బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. కామన సెంటర్ సర్వీ్స(సీఎ్సఈ), స్టాక్ హోల్డిం...
టమోటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రైతులకు ఊరట లభిస్తోంది. మార్కెట్లో 25 కిలోల బాక్సు గురువారం రూ.600 నుంచి రూ.800 వరకు ధర పలికింది. ఈ మాత్రం ధరలు నిలకడగా కొనసాగితే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. యాడికి, రాయలచెరువు, లక్షుంపల్లి, వెంగన్నపల్లి తదితర గ్రామాల్లో 150 ఎకరాల్లో టమోటా సాగుచేశారు. ఎకరానికి రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టారు. వాతావరణం, ధరలు అనుకూలిస్తే టమోటా సాగు లాభదాయకమే. కానీ ప్రతికూల పరిస్థితులు ఎ...
కళ్యాణదుర్గం మండలం బోయలపల్లికి చెందిన నల్లబోతుల హనుమంతప్ప నిండు నూరేళ్ల జీవితం పూర్తి చేసుకున్నారు. కొడుకులు, కూతుళ్లు, మనవళ్లు, మనవరాండ్రు, ముని మనవళ్లు, ముని మనవరాండ్రు, వారి జీవిత భాగస్వాములు.. ఇలా సుమారు 50 మంది కుటుంబ సభ్యుల సమక్షంలో గురువారం 101వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. హనుమంతప్పకు ముగ్గురు ...