Home » Draupadi Murmu
గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే! వారిలో 67 మందికి ఏప్రిల్ 22వ తేదీన పద్మ అవార్డుల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
న్యూఢిల్లీ: మాజీ ఉప ప్రధాని, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీనియర్ రాజకీయ నేత ఎల్కే అద్వానీకి ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రత్న అవార్డు ప్రదానం చేయనున్నారు. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన బయటికి రాలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అద్వానీ నివాసంలోనే అవార్డు ప్రదానం చేయాలని నిర్ణయించారు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి ఈరోజు భారత రత్నలు ప్రదానం చేశారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు.
తెలంగాణ కొత్త గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. సోమవారం తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.
తమిళిసై ఇవాళ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఒకే దేశం -ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాల)పై బారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తి అయింది. ఈ కమిటీ తుది నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కోవింద్ అందజేశారు.
సోమవారం ‘మిషన్ దివ్యాస్త్ర’లో (Mission Divyastra) భాగంగా అగ్ని-5 క్షిపణికి (Agni-5 Missile) సంబంధించి నిర్వహించిన తొలి ఫ్లైట్ టెస్ట్ విజయవంతమైన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వీకే సరస్వత్ (VK Saraswath) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది భారతదేశపు సెకండ్-స్ట్రైక్ సామర్థ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిందని కొనియాడారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం మొదలయ్యాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆమె కీలక ప్రసంగం ఇచ్చారు. ఈ సందర్భంగా గత కొన్నేళ్లలో దేశం సాధించిన పలు విజయాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. విజయాలకు సంబంధించి ప్రభుత్వం చూపిన చొరవను ఆమె ప్రశంసించారు.
మధ్యంతర బడ్జెట్-2024-25ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. నూతన పార్లమెంట్ భవనంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి ప్రసంగంతో సమావేశాలు మొదలయ్యాయి. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆమె మాట్లాడారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనుండగా ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కావడం గమనార్హం. నూతన పార్లమెంట్ భవనంలో ఇవే మొదటి సమావేశాలు కావడం గమనార్హం.