Graduation Ceremony : సంప్రదాయ వస్త్రాలతో విద్యార్థులు, అధ్యాపకులు
ABN , Publish Date - Dec 18 , 2024 | 06:12 AM
మంగళవారం ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పట్టాలు తీసుకున్న విద్యార్థినీ విద్యార్థులు..
మంగళగిరి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): మంగళవారం ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పట్టాలు తీసుకున్న విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులందరూ సంప్రదాయ వస్త్రాలు ధరించి వచ్చి విశేషంగా ఆకట్టుకున్నారు. మగవారంతా పంచె, ధోవతులు.. మహిళలందరూ చీరెలను ధరించారు. అవి కూడా మంగళగిరి చేనేత వస్త్రాలే కావడం మరో విశేషం! కలంకారీ ముద్రణతో కూడిన ఈ సంప్రదాయ వస్త్రాలను ధరించి.. తెలుగుదనం ఉట్టిపడేలా వేడుకకు హాజరుకావడం విశేషం.