Home » Drugs Case
పంజాగుట్ట పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ లింకును ఛేదించారు. పెద్ద ఎత్తున ఎక్స్టోసి మాత్రలు (Extosi pills), ఎండీఎంఏ (MDMA), గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరబాద్ డ్రగ్స్ తెచ్చి కస్టమర్లకు విక్రయిస్తున్న సయూద్, ముంబాయికి చెందిన రోమి, పాలస్తీనాకు చెందిన సయీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Daggubati Purandeswari: ఇటీవల విశాఖ తీరంలో పట్టుబడిన డ్రగ్స్ కేసులో నిజానిజాలు తెలియకుండా తనపై, తన కుటుంబ సభ్యులపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న నీలి పత్రిక(సాక్షి)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రికపై రూ. 20 కోట్లకు పరువు నష్టం దావా(Defamation) వేశారు. విశాఖ డ్రగ్స్(Vizag Drugs Case) పట్టివేత వ్యవహారంలో సంధ్య ఎక్స్‌పోర్ట్స్‌లో తాము భాగస్వాములు అని..
జగిత్యాలలో (Jagtial) తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసులో (Drugs Case) తాజాగా మరో షాకింగ్ కోణం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని గంజాయికి బానిస చేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఏ తండ్రి అయితే ఈ గంజాయి వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారో, ఆయన కుమార్తెపైనే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేలింది.
విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ లభించిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు(Dadi Veerabhadrarao) సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్ల రూపాయల మత్తు పదార్థాల వ్యాపారి సంధ్య అక్వా ఎక్స్‌పోర్ట్స్ యజమానులను ఉరితీయాలని హెచ్చరించారు. మానవత్వం లేని ఈ మృగాలను, వారికి దన్నుగా నిలుస్తున్న రాజకీయ నాయకులను శిక్షించాలని అన్నారు.
సీఎం జగన్ అన్నపూర్ణాంధ్రప్రదేశ్‌ను డ్రగ్గాంధ్రప్రదేశ్‌గా మార్చారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ (Pranav Gopal) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఓటర్లను మత్తు పదార్థాలకు బానిసగా చేసి ఓట్లు దండుకోవడానికి జగన్, అతని అనుచరులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
తనపై సోషల్ మీడియాలో వైసీపీ (YSRCP) నేతలు విషప్రచారం చేస్తున్నారని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) అన్నారు. శనివారం నాడు సచివాలయంలోని సీఈఓ ఆఫీసుకు వచ్చారు. తనపై సోషల్ మీడియాలో చేస్తున్న విషప్రచారంపై అడిషనల్ సీఈఓను కలిసి ఫిర్యాదు చేశానని తెలిపారు. ట్విట్టర్, సోషల్ మీడియా వేదికలుగా తనపై వైసీపీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ అంటే దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ.. ఇప్పుడు యువతకు మత్తు సరఫరా చేసే డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శించారు. గంజాయి, హెరాయిన్, కొకైన్ ఏది కావాలన్నా దొరికే ఉడ్తా ఆంధ్రప్రదేశ్‌గా మారిందని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్నాయని వివరించారు.
జగిత్యాలలో (Jagtial) తీవ్ర కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో (Drugs Case) తాజాగా మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 10వ తరగతి విద్యార్థినులు గంజాయికి బానిసవ్వడం చూసి నివ్వెరపోయిన పోలీసులు.. వెంటనే విచారణ చేపట్టి, నిందితులను పట్టుకున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన ముఠాని అరెస్టు చేశారు. వీళ్లందరు చదువు మానేసి.. గంజాయి విక్రయిస్తున్నారని తెలిసింది.
లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నకిలీ మద్యం మరణాలు పంజాబ్ నే కాదు.. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. పంజాబ్ ( Punjab ) లోని సంగ్రూర్‌లో నకిలీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. సంగ్రూర్ సమీపంలోని దిర్బా గుజ్రాన్ గ్రామంలో నకిలీ మద్యం సేవించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్‌ని అంతమొందించేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా.. డ్రగ్స్ (Drugs) వినియోగం అంతకంతకూ వ్యాపిస్తూనే ఉంది. కొన్ని ముఠాలు రహస్యంగా ఈ చీకటి దందాని నడిపిస్తూనే ఉన్నాయి. తమ జేబులు నింపుకోవడం కోసం విద్యార్థుల జీవితాలతో డ్రగ్స్ ముఠాలు చెలగాటమాడుతున్నాయి. వారిని మత్తుకి బానిసలు చేసి జీవితాలను నాశనం చేస్తున్నాయి.