NPPA : 41 రకాల మందుల ధరలు తగ్గింపు
ABN , Publish Date - May 17 , 2024 | 04:25 AM
మధుమేహం, గుండె, కాలేయ సంబంధిత సమస్యల చికిత్సలో వినియోగించే 41 రకాల మందులు, ఆరు రకాల ఫార్ములేషన్ల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.
న్యూఢిల్లీ, మే 16 : మధుమేహం, గుండె, కాలేయ సంబంధిత సమస్యల చికిత్సలో వినియోగించే 41 రకాల మందులు, ఆరు రకాల ఫార్ములేషన్ల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.
ధరలు తగ్గించిన మందుల్లో కొన్ని యాంటీబయాటిక్స్, మల్టీవిటమిన్లు, యాంటాసిడ్స్ ఉన్నాయి. ధరల తగ్గింపునకు సంబంధించి నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్‌పీపీఏ) గురువారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.
ధరల తగ్గింపుపై డీలర్లుకు వెంటనే సమాచారం ఇవ్వాలని, తగ్గింపును తక్షణమే అమలు చేయాలని ఔషధ తయారీ కంపెనీలను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల కొన్ని రకాల మందుల ధరలు భారీగా తగ్గనున్నాయి.