Home » Drugs Case
విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను లెక్క చేయకుండా వాలంటీర్స్ను వైసీపీ వాడుకుంటోందని, పోలీసులు కూడా ఈసీ కోడ్‌ను లెక్క చెయ్యకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
ఎప్పుడూ గంజాయి అక్రమ రవాణాతో వార్తల్లో నిలిచే విశాఖలో కొకైన్ కలకలం రేగిన విషయం తెలిసిందే. బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటెయినర్లో సుమారు 25వేల కిలోల డ్రై ఈస్ట్‌లో కొకైన్ కనిపించడం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ మాట్లాడుతూ.. విశాఖలో డ్రగ్స్ పట్టుబడిందని.. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపడుతోందన్నారు.
వైసీపీ ప్రభుత్వం(YSRCP Govt) ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ పోర్టులో సీబీఐ 25000 కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకోవడం షాక్‌కు గురిచేసిందని అన్నారు. పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనంపై విస్మయం వ్యక్తం చేశారు.
టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థల యజమాని ఎలాన్ మస్క్(Elon Musk) ఇటివల డ్రగ్స్ వాడకం(Drug Usage) గురించి సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో మస్క్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన ఏ ప్రకటన చేశారో ఇక్కడ తెలుసుకుందాం.
లాలీపాల్లు కంటే తేలిగ్గా మాదకద్రవ్యాలు దొరుకుతున్నాయని, పోలీసులు మాత్రం మాదకద్రవ్యాల అక్రమ విక్రేతల జాడ తెలుసుకోవడంలో విఫలమవుతున్నారని ఓ యూనివర్శిటీ విద్యార్థి స్యయంగా పోలీసులకు క్లాస్ పీకాడు. డ్రగ్స్ బెడదను నిర్భీతగా పోలీసుల ముందే ఆ విద్యార్థి బయటపెట్టడాన్ని చూసి తోటి స్నేహితులు చప్పట్లతో హర్షాతిరేకం వ్యక్తం చేశారు.
Radisson Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వారం, పదిరోజులుగా ఎక్కువగా వినిపిస్తున్నది.. కనిపిస్తున్నది రాడిసన్ డ్రగ్స్ కేసు (Drugs Case) ..!. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు.. అంతకుమించి కొత్త వ్యక్తుల పేర్లు వెలుగుచూస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసు పలు మలుపులు తిరగ్గా.. తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది...
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో గచ్చిబౌలి పోలీసుల ఎదుట డైరెక్టర్ క్రిష్ విచారణకు హాజరయ్యారు. తాజాగా పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించిన క్రిష్ విచారణకు హాజరై డ్రగ్స్ టెస్ట్‌ల కోసం శాంపిల్స్ ఇచ్చారు. దాదాపు నాలుగు గంటల విచారణ జరిపి పోలీసులు శాంపిల్స్ తీసుకుని క్రిష్‌ను పంపించేశారు.
హైదరాబాద్: రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్టు ఎదురైంది. గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరుకాకుండా డైరెక్టర్ క్రిష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల క్రితం ఈరోజు వ్యక్తిగతంగా హాజరవుతానంటూ పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు.
డ్రగ్స్ కేసు మూలాలు వెదికేందుకు నార్కోటిక్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణను మరింత వేగవంతం చేశారు. టీఎస్ న్యాబ్ విచారణలో కీలక సమాచారాన్ని స్టాన్లీ వెల్లడించాడని తెలుస్తోంది. ఇటీవలే 8 కోట్ల విలువైన డ్రగ్స్‌తో స్టాన్ లీ పట్టుబడ్డాడు. గోవా కోల్వలే జైలు నుంచే స్టాన్ లీకి ఓక్రా ముఠా డ్రగ్స్ సరఫరా చేసినట్టు టీఎస్ న్యాబ్ గుర్తించింది.
హైదరాబాద్: రాడిసన్ హోటల్లో డ్రగ్స్ వ్యవహారంలో సినీ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ బుధవారం పోలీసుల విచారణకు హాజరుకాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం తాను ముంబైలో ఉన్నందున మరో రెండు రోజులు సమయం కావాలని కోరారు. శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని తెలిపారు.