AP Politics: సాక్షి పత్రికపై పురంధేశ్వరి కన్నెర్ర.. రూ. 20 కోట్ల పురువు నష్టం దావా..
ABN , Publish Date - Mar 24 , 2024 | 08:15 PM
Daggubati Purandeswari: ఇటీవల విశాఖ తీరంలో పట్టుబడిన డ్రగ్స్ కేసులో నిజానిజాలు తెలియకుండా తనపై, తన కుటుంబ సభ్యులపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న నీలి పత్రిక(సాక్షి)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రికపై రూ. 20 కోట్లకు పరువు నష్టం దావా(Defamation) వేశారు. విశాఖ డ్రగ్స్(Vizag Drugs Case) పట్టివేత వ్యవహారంలో సంధ్య ఎక్స్‌పోర్ట్స్‌లో తాము భాగస్వాములు అని..
Daggubati Purandeswari: ఇటీవల విశాఖ తీరంలో పట్టుబడిన డ్రగ్స్ కేసులో నిజానిజాలు తెలియకుండా తనపై, తన కుటుంబ సభ్యులపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న నీలి పత్రిక(సాక్షి)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రికపై రూ. 20 కోట్లకు పరువు నష్టం దావా(Defamation) వేశారు. విశాఖ డ్రగ్స్(Vizag Drugs Case) పట్టివేత వ్యవహారంలో సంధ్య ఎక్స్‌పోర్ట్స్‌లో తాము భాగస్వాములు అని కల్పిత వార్తలు ప్రచురించడంపై పురంధేశ్వరి సీరియస్ అయ్యారు. ఆధార రహిత వార్తలు ప్రచురించి, తమకు పరువునష్టం కలిగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురంధేశ్వరి తరఫున న్యాయవాది వివి సతీష్ సాక్షి పత్రిక యాజమాన్యానికి ఈ నోటీసులు పంపించారు.
విశాఖలో డ్రగ్స్..
బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుండి విశాఖపట్నం పోర్టుకు ‘ఎస్‌ఈకేయూ 4375380’ కంటెయినర్‌లో 25,000 కేజీల నిషేదిత నార్కోటిక్ డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. ఈ డ్రగ్స్‌ను రొయ్యల మేతకు ఉపయోగించే ‘డ్రైడ్ ఈస్ట్’ పేరుతో సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట దిగుమతి అయ్యింది. కాగా, జనవరి 14న బ్రెజిల్ లోని శాంటోస్ పోర్టు నుండి బయలుదేరిన ఈ కంటెయినర్‌లో నిషేధిత మాదకద్రవ్యాలు ఉన్నాయని సీబీఐకి ఇంటర్‌పోల్ అధికారులు సమాచారం అందించారు.
దాంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఉమేశ్, ఆకాష్ కుమార్ మీనా, గౌరవ్ మిట్టల్ బృందం స్థానిక కస్టమ్స్ అధికారుల సాయంతో పోర్ట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డ్రగ్స్ గుట్టు రట్టయ్యింది. ఈ లోడ్‌లో మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంఫటేమిన్, మెస్కలిన్ వంటి నిషేధిత మాదక ద్రవ్యాలున్నట్లు తేల్చారు.