Home » East Godavari
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఇలాగే టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు వైసీపీకి వచ్చారు. ఆయన రాకతో రాజోలు నియోజకవర్గ వైసీపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన గొల్లపల్లి సూర్యారావును సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో రాపాక అనుచరులు వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు.
విశాఖ: నగరంలో యువకుడి కిడ్నాప్ వ్యవహారం చివరికు విషాదంగా ముగిసింది. వెడ్డింగ్ షూట్ నిమిత్తం తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లిన ఫోటోగ్రాఫర్ సాయి పవన్ కల్యాణ్ హత్యకు గురయ్యాడు. ఈనెల 26న వెడ్డింగ్ షూట్ ఉందని పవన్‌కు కొందరు వ్యక్తులు మెసేజ్ చేశారు.
Andhrapradesh: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డితో బహిరంగ చర్చకు వెళ్ళకుండా రామవరంలో రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను కొవ్వూరుకు తీసుకళ్లారు. అయితే రామకృష్ణారెడ్డిని విడుదల చేయాలంటూ కొవ్వూరు జాతీయ రహదారిపై టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు.
తూర్పుగోదావరి: బహిరంగ చర్చ కోసం శుక్రవారం ఉదయం 11 గంటలకు వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇంటికి వెళతానని, ఎమ్మెల్యే అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతానని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
అనపర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహిరంగ చర్చకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం 11 గంటలకు వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వస్తానని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇంటికి వస్తే శరీరంలోని పార్టులు తీసేస్తానంటూ వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు.
తూర్పుగోదావరి జిల్లా: అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చోటు చేసుకున్నాయి. సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై బహిరంగ లేఖతో ఈనెల 19 న ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి..
Andhrapradesh: స్వగ్రామాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటును ఎదుర్కోక తప్పడం లేదు. జిల్లాలోని రావులపాలెం మండలం గోపాలపురంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్వగ్రామంలోనే దళితులు ఎదురుతిరిగారు. గోపాలపురం సిద్దార్థ్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలకు ఎమ్మెల్యే తండ్రి పేరు పెట్టడాన్ని దళితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి.
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ఒరిస్సాకు చెందిన ఆర్టీసీ బస్సు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఒరిస్సాలోని సబరంగాపూర్ నుంచి విజయవాడకు బస్సు వెళుతోంది. టైరు పంక్చర్ అయి బస్సు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టింది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పది స్థానాల అభ్యర్థులపై టీడీపీకి పూర్తి స్పష్టత వచ్చింది. జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలకు గాను ఆరు సీట్లకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీలో అసమ్మతి నేతలు వరుసగా గళం వినిపిస్తున్నారు. ప్రజామోదం లేని నేతలను రాబోయే ఎన్నికల్లో నిలబెట్టవద్దని ఆ పార్టీ హై కమాండ్‌కు అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే రంగనాథరాజుని అచంట నియోజకవర్గం నుంచి నిలబెట్టవద్దని అధిష్ఠానానికి సూచిస్తున్నారు.