AP News: ఇంటికి వస్తే శరీరంలో పార్టులు తీసేస్తానంటూ నల్లమిల్లికి వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్
ABN , Publish Date - Mar 01 , 2024 | 07:53 AM
అనపర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహిరంగ చర్చకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం 11 గంటలకు వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వస్తానని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇంటికి వస్తే శరీరంలోని పార్టులు తీసేస్తానంటూ వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు.
కాకినాడ: అనపర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేడు టీడీపీ (TDP) మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Nallamilli Ramakrishna Reddy) బహిరంగ చర్చకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం 11 గంటలకు వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) ఇంటికి వస్తానని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇంటికి వస్తే శరీరంలోని పార్టులు తీసేస్తానంటూ వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి (MLA Sathi Suryanarayana Reddy) హెచ్చరించారు. రామవరం గ్రామంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్‌కి పోలీసులు రంగం సిద్ధం చేశారు. రాత్రి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఈ క్రమంలోనే అనపర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.