Home » East Godavari
Andhrapradesh: రాజమండ్రిలోని ఆంధ్రా పేపర్ మిల్కు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. గురువారం పేపర్ మిల్లు గేట్లకు యజమాన్యం తాళాలు వేసింది. దీంతో కార్మికులు గేటు బయటే వేచి ఉన్నారు. ఉన్నట్టుండి పేపర్ మిల్కు లాకౌట్ ప్రకటించడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పేపర్ మిల్లు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Andhrapradesh: అధికార పార్టీ ప్రలోభాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. బుధవారం గోపాలపురం మండలం లో విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్న బీజేపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ అభ్యర్థి పూరందేశ్వరికి తెలుగు మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు నియోజవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు.
ఏపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ వ్యూహాలతో పాటు.. అనేక కుట్రలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాగైనా మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఎంత ప్రయత్నిస్తున్నా.. ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా.. కూటమి బలం రోజురోజుకు పెరుగుతుండటంతో వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుందనే చర్చ జరుగుతోంది.
తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఈ ఉదయం 9 గంటలకు తణుకు జాతీయ రహదారి మీదుగా సిద్దాంతం బ్రిడ్జ్ నుంచి రావులపాలెం, జొన్నాడ సెంటర్, చెముడులంక, పొట్టిలంక చేరుకుంటారు.
కాకినాడ జిల్లా: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లా, పెద్దాపురంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బీవీసీ లాజిస్టిక్స్‌కు సంబంధించిన వాహనంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న రూ. 5 కోట్ల విలువైన 8 కేజీల 116 గ్రాముల బంగారం, 46 కేజీల వెండి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అధికార వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సెగ తగిలింది. కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలవరీ చేసిన అనంతబాబుకు దళితులు చుక్కలు చూపించారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అనంతబాబును దళితులు తరమి తరమి కొట్టారు.
Andhrapradesh: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ఆలస్యంపై టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీ విషయంలో వైసీపీ నేతలు టీడీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ ఈ అస్త్రాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను ఉపయోగించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నాయన్నారు.
కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో రోజు ఆదివారం పిఠాపురంలో పర్యటించనున్నారు. పాదగయ క్షేత్రంలో ఉదయం 11గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 12 గంటలకు శ్రీ పాద శ్రీవల్లభ దత్తత్రేయుని దర్శించుకుని పూజలు చేయనున్నారు.
అనపర్తిలో తెలుగుదేశం పార్టీ ఉనికిని ప్రమాదంలో పడేసింది మీరేనని.. ఇప్పుడు అక్కడ పార్టీని కాపాడుకోవాల్సింది కూడా మీరేంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎదుట ఆ నియోజకవర్గ ఇన్చార్జీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది.
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు మరో అవమానం జరిగింది. ఈనెల 14న (గురువారం) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఆరోజు 10 వేల కార్లు..జనాలు తనవెంట రావాలని ఇటీవల ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.