TDP: పింఛన్ల పంపిణీ ఆలస్యంపై చినరాజప్ప ఫైర్
ABN , Publish Date - Apr 01 , 2024 | 12:47 PM
Andhrapradesh: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ఆలస్యంపై టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీ విషయంలో వైసీపీ నేతలు టీడీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ ఈ అస్త్రాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను ఉపయోగించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నాయన్నారు.
కాకినాడ, ఏప్రిల్ 1: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ఆలస్యంపై టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప (TDP Leader Nimmakayala Chinarajappa) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీ విషయంలో వైసీపీ నేతలు (YSRCP Leaders) టీడీపీ (TDP) మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ (CM Jagan) ఈ అస్త్రాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను ఉపయోగించకూడదని ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశాలు ఉన్నాయన్నారు. ఆన్‌లైన్ విధానంలో కానీ ప్రభుత్వ ఉద్యోగులతో కానీ వెంటనే పింఛన్ల పంపిణీ చెయాలని డిమాండ్ చేశారు. చీఫ్ సెక్రటరీ దీనిపై స్పందించాలన్నారు. వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు కొనసాగిస్తామని.. పక్బందీగా పార్టీలకు అతీతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు.
Arvind Kejriwal: కేజ్రీవాల్ కస్టడీ మళ్లీ పొడిగింపు.. ఇప్పట్లో బయటకు కష్టమేనా?
కాగా.. వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయరాదన్న కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వైసీపీ రాజకీయ రంగు పులుముతోంది. టీడీపీ ఫిర్యాదు చేయడం వల్లే ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందని, ఈనెల నుంచి అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చేందుకు 10 రోజులు పడుతుందంటూ ప్రభుత్వమే దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఒకటిన్నర లక్షల మంది ఉద్యోగులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగులందరికీ బాధ్యతలు అప్పజెబితే రెండు మూడు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేసే అవకాశముంది. అయితే సర్కార్ కావాలనే పెన్షన్ పంపిణీకి 10 రోజులు పడుతుందంటూ ఈ ప్రక్రియను సాగదీసే కుట్ర చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
TDP-Janasena: హమ్మయ్యా.. అలక తీరింది.. అక్కడ టీడీపీ జనసేన ఒక్కటయ్యాయి..
CM Jagan: జగన్ బెయిల్ రద్దుపై ఇవాళ సుప్రీంలో ఏం జరిగిందంటే..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..