Home » Economy
తన స్థానాన్ని పదిలం చేసుకుని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనకున్న జపాన్(Japan) ఆశలు ఆడియాసలయ్యాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించి నాలుగో స్థానానికి పడిపోయింది. గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జర్మనీ జీడీపీ 2023లో 4.4 ట్రిలియన్ డాలర్లు కాగా, జపాన్ జీడీపీ 4.29 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది.
Union Budget 2024: ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి ప్రతి నెలా ఏదో ఒక మార్పు ఉంటూనే ఉంటుంది. అయితే, మిగతా నెలలతో పోలిస్తే.. ఫిబ్రవరి నెల చాలా కీలకం అని చెప్పుకోవాలి. రానున్న ఫిబ్రవరి నెలలో ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి కీలక మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
Economy: 2027 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశంగా అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఆశాభావం వ్యక్తం చేశారు.
శ్రీలంక(Srilanka) పూర్తిగా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేదని ఆ దేశ అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే(Ranil Wickremesinghe) వెల్లడించారు. 2023 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్(Srilanka Budjet)ను ఆ దేశ పార్లమెంట్ లో ఆయన ఇవాళ ప్రవేశ పెట్టారు.
చంద్రయాన్-3 విజయవంతమవడంతో మన దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనాలు చేకూరబోతున్నాయి. 2025 నాటికి మన దేశ రోదసి ఆర్థిక వ్యవస్థ విలువ 13 బిలియన్ డాలర్లు ఉండవచ్చునని అంచనా. స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడులతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని చెప్తున్నారు.
సురక్షితమైన, నమ్మదగిన, నిలదొక్కుకోగలిగే డిజిటల్ ఎకానమీ కోసం జీ20 హై లెవెల్ నిబంధనావళిపై ఏకాభిప్రాయాన్ని నిర్మించడం చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భద్రతాపరమైన ముప్పులు, సవాళ్లను ఎదుర్కొంటుందని గుర్తు చేశారు.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు ముఖ్యమైన హామీలు ఇచ్చారు. మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, వృత్తి నైపుణ్యంగల యువత కోసం ప్రత్యేక పథకాలు వంటివాటిని ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎర్ర కోట వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
భారత దేశ భవిష్యత్తు అత్యద్భుతంగా ఉండబోతోందని గోల్డ్మన్ శాచెస్ (Goldman Sachs) నివేదిక జోస్యం చెప్పింది. ఆర్థిక రంగంలో జపాన్, జర్మనీ, అమెరికాలను వెనుకకు నెట్టి భారత దేశం ఎదగబోతోందని తెలిపింది. 2075నాటికి ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఘనత సాధిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలో 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అనే విషయం తెలిసిందే.
భారతీయ రిజర్వు బ్యాంక్ గురువారం అందరూ ఊహించినట్లుగానే రెపో రేటును యథాతథంగా కొనసాగించింది.
యూరోప్లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగల జర్మనీ ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. దీంతో యూరోపియన్ యూనియన్ కరెన్సీ యూరో విలువ గురువారం పతనమైంది.