Home » ED
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల బాండ్ల నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో నిర్మలా సీతారామన్పై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్ నగర్ పీఎస్ పోలీసులను ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.
ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్ పేరుతో రూ.400 కోట్ల మేర మోసం చేసిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఈడీ తెలిపింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేసింది.
మహేష్ కో-ఆపరేటీవ్ బ్యాంకులో రూ.300 కోట్ల నిధుల గోల్మాల్కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ, ఈడీ కోర్టు జూలై 22 వరకు పొడిగించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జుడీషియల్ కస్టడీని జులై 18 వరకు రౌస్ అవెన్యూ కోర్ట్ పొడగించింది.
ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా చేసుకొని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆరోపించారు. అందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని వారు మండిపడ్డారు.
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరిస్తున్న తీరుపై ఆయన భార్య సునీత కేజ్రీవాల్ మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అన్నట్లుగా ఈడీ వ్యవహరశైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎ్ఫసీఆర్ఏ) నిబంధనలకు విరుద్ధంగా ఆమ్ ఆద్మీ పార్టీ 2014-2022 నడుమ రూ.7 కోట్ల మేర విదేశీ నిధులను అందుకున్నట్టు ఈడీ ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఈడీ గత ఏడాది ఆగస్టులోనే ఒక లేఖ రాసింది.
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే నేడు కవితను అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ నేటితో రిమాండ్ ముగుస్తోంది. నిజానికి కవిత బెయిల్ కోసం ఆమె తరుఫు న్యాయవాదులు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు ఆమెకు బెయిల్ రిజెక్ట్ అయ్యింది.