Home » Etela rajender
Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో పోటీ చేసి 10 సీట్లకు పైగా గెలవాలని బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించామని ఆ పార్టీ జాతీయ నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈటెల మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని.. కానీ ఇప్పటికీ ఒక్క హామీ కూడా నెరవెర్చలేదన్నారు.
నేడు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు వెళ్లనున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల తదితరులు సాయంత్రం బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో బీజేపీ నేతలు చర్చించనున్నారు. మార్చి రెండో వారంలో అభ్యర్థుల ప్రకటన చేయాలని బీజేపీ భావిస్తోంది. హైకమాండ్ వద్ద ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు పేర్లతో లిస్ట్ రెడీ చేయనున్నారు.
Etela Rajender Issue: తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender).. కాషాయ కండువా తీసేసి కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకోబోతున్నారా..? అతి త్వరలోనే హస్తం గూటికి చేరుతారా..? పార్టీలో చేరిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేస్తారా..? అంటే ఇవన్నీ నిన్న, మొన్నటి వరకూ ఆయన అభిమానులు, అనుచరుల్లో మెదిలిన ప్రశ్నలు. దీనికి తోడు కాంగ్రెస్ ముఖ్యనేతలతో కలిసున్న ఫొటో కూడా నెట్టింట్లో దర్శనమివ్వడంతో ఇక ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.. పక్కాగా కండువా మార్చేస్తారని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయ్.
Telangana: గతంలో బీజేపీకి 14 వందల పైగా ఓట్లు వస్తే ఇప్పుడు ప్రతీ గ్రామంలో కమలం పార్టీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు తయారు అయ్యారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
Telangana: ఎన్ని విమర్శలు వచ్చినా, తప్పుడు ప్రచారం చేసినా బీజేపీకి ప్రజలు ఎనిమిది సీట్లు కట్టబెట్టారని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకీ ఓట్లు సీట్లు పెంచేందుకు కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు చిత్ర విచిత్రమైన ఫలితాలను అందిస్తున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్ వెనుకబడటమే షాక్‌ను కలిగిస్తుంటే.. మరోవైపు బీజేపీ కీలక నేతలంతా వెనుకబడిపోతుడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీజేపీ కీలక నేతలైన బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందనరావు వెనుకబడిపోయారు.
గజ్వేల్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, జీతాలు పెన్షన్లు ఇవ్వాలంటే భూములు అమ్మాల్సిందే అని విమర్శించారు.
Telangana Elections: దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఆ భూమి ఇవ్వకపోగా ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కున్నారని బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్, ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగ పాల్గొన్నారు.
Telangana Elections: జిల్లాలోని ములుగు మండలంలోని కొత్తూరుతో పాటు పలు గ్రామాల్లో బీజేపీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో గజ్వేల్ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హుజూరాబాద్‌కు నువ్వు రాకపోతే నీ దగ్గరకే నేనోస్త అని గజ్వేల్‌కు వచ్చిన.. నేను వచ్చాక నువ్వు కామారెడ్డి పారిపోయావు’’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఈటెల వ్యాఖ్యలు చేశారు.
Telangana Elections: జిల్లాలోని గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.