Home » Fuel Prices
పెట్రోల్, డీజిల్ ధరలు కొన్నాళ్లుగా అలాగే స్థిరంగా ఉంటున్నాయి. ఎలాంటి తగ్గుదల నమోదు కాలేదు. అయితే ధన త్రయోదశి సందర్భంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కీలకమైన ప్రకటన చేశాయి. పెట్రోల్ పంప్ డీలర్లకు చెల్లించే డీలర్ కమిషన్ను పెంచుతున్నట్లు ప్రకటించాయి.
ఇలా ఒకటీ, రెండూ కాదు... రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వాహనాలను పెట్రోల్, డీజిల్ కొరత పట్టి పీడిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా... జిల్లాల్లో నెలల తరబడి బిల్లులు పెండింగ్లో ఉంటున్నాయి.
చాలా మంది వాహనదారులకు ఇంధన వాడకం విషయంలో పలు రకాల సందేహాలు ఉంటాయి. బైక్(bike) లేదా కారు(car)లో ఫుల్ ట్యాంక్ ఇంధనం(fuel) నింపుకుంటే మంచి మైలేజీ వస్తుందా లేదా లీటర్ నింపుకోవాలా అనే సందేహం ఉంటుంది. అయితే అసలు విషయమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో ఇంధన ధరలు తగ్గుతాయని ఆశిస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కొత్త ఏడాదిలో ఇంధన రేట్లు తగ్గుతాయని(Fuel price cut) వచ్చిన వార్తల్లో నిజం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ(hardeep singh poori) స్పష్టం చేశారు.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ఇంధన ధరల(Fuel Prices) తగ్గుదల. ఎన్నికల సందర్భంగా అధికార బీజేపీ ప్రభుత్వం వీటి ధరల్ని స్వల్పంగా తగ్గిస్తుందనే వార్తలు షికారు చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే గ్యాస్ బండ భారాన్ని కాస్త తగ్గించడంతో పండగ సీజన్లో పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలోనూ ఊరట లభించకపోదా అని వాహనదారుల్లో ఆశలు చిగురించాయి. కానీ, సౌదీ అరేబియా, రష్యా ఆ ఆశలపై నీళ్లు చల్లాయి.