Share News

Delhi: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే..

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:04 PM

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ఇంధన ధరల(Fuel Prices) తగ్గుదల. ఎన్నికల సందర్భంగా అధికార బీజేపీ ప్రభుత్వం వీటి ధరల్ని స్వల్పంగా తగ్గిస్తుందనే వార్తలు షికారు చేస్తున్నాయి.

Delhi: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే..

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ఇంధన ధరల(Fuel Prices) తగ్గుదల. ఎన్నికల సందర్భంగా అధికార బీజేపీ ప్రభుత్వం వీటి ధరల్ని

స్వల్పంగా తగ్గిస్తుందనే వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి(Hardeep singhpuri) క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలో ఎలాంటి వాస్తవాలు లేవని.. ఇంధన ధరలు తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనేదీ లేదని వివరించారు.

ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా నష్టపోయాయని తెలిపారు.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Jan 03 , 2024 | 03:05 PM